వాస్తు శాస్త్ర పరిభాషలో అష్టదిక్పాలకుల్లో ఈశాన్య స్థానాధిపతి ఈశ్వరుడు అంటారు. కాబట్టి, ఎలాంటి బరువులు, ఎత్తులు కానీ ఉంచరాదని.. అలా చెయ్యడం వలన అనార్ధాలకు తావిస్తుందంటూ భయబ్రాంతులకు గురైయ్యేలా చాలామంది చెబుతుంటారు. నిజానికి, ఒక ఏడాదిలో మొదటి ఆరునెలలు అనగా జనవరి 14 నుంచి ఉత్తరాయణం కాలమును.. ఆ తర్వాతి ఆరునెలలు అనగా జూన్ మొదలుకుని జనవరి 13 దాకా దక్షనాయణ కాలక్రమం ఉంటుంది.
ఉత్తరాయణంలో పగటి పుట సమయం ఎక్కువగా ఉండటం వల్ల సూర్యరశ్మీ ఇళ్లలోకి ఎక్కువ సమయం ప్రసరిస్తుంది. ఉదయం పూట వీచే గాలుల్లో తాజా ప్రాణవాయువు లభించేందుకు ఈశాన్యంలో తలుపులు, కిటికీలు ఏర్పాటు చేసుకుంటాం. వాటిని ఎక్కువ సమయం తెరిచి ఉంచటం చేస్తాం. దీని వల్ల శివుడితో కానీ ఆధ్యాత్మికతతో కానీ వాస్తుకి ఎలాంటి సంబంధం లేదని గమనించాలి.
- • ఇంటి నుంచి బయటికి వెళ్లే నీరు ఈశాన్యం దిశలోనే వెళ్లాలా?
గత రెండు, మూడు దశాబ్దాల మునుపటి కాలం దాకా.. ఇళ్లను గమనిస్తే.. ప్రతి గది తలుపులకి కింది భాగంలో గడప ఉండేది. దాన్ని “చౌకట్టు” అని కూడా అంటాం. ఇల్లు కడిగిన ప్రతిసారి గడపకు పసుపు రాసేవాళ్లం. అది కూడా కేవలం క్రిమికీటకాల్ని నిరోధించేందుకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఇల్లు కడిగిన నీళ్ళు ఏ గదిలోనూ నిలిచిపోకుండా ఉండేందుకు.. ఒక గది నుంచి మరో గదికి ఒకే వైపు ప్రవహించేలా చూసుకుని ఏట వాలుగా పెట్టుకునే వారు. ఇల్లు కడిగిన తర్వాత అవి మురికి నీళ్ళు కాబట్టి ఇంటి బైటికెళ్లెలా సింహద్వారం ఎటువైపు ఉంటే అటు వైపు కన్నం పెట్టుకునే వాళ్లూ.
* ఈ మధ్య కాలంలో కొందరు అత్యుత్సాహకులైన వాస్తుశాస్త్ర (అ)జ్ఞానులకు శాస్త్రం ఓవర్ ఫ్లో అయ్యి.. జనరల్ నాలెడ్జి నశించిపోయింది. కేవలం బుక్ నాలెడ్జితోనే కాలయాపన చేస్తున్నారు. దీంతో వాస్తు చెప్పించుకున్న ఇళ్ల యజమానులు దిక్కు తోచక అలాంటి కాలయముల పాలౌతున్నారు. శాస్త్రాన్ని భ్రష్ఠు పట్టించడానికి ఇంతకంటే దౌర్భాగ్యాం ఇంకేమైనా ఉంటుందా చెప్పండి?
వాస్తుపై మీకు ఎలాంటి సందేహాలున్నా.. సమస్యలున్నా.. మాకు రాయండి. మీకు జవాబులిస్తాం. మీరు ప్రశ్నలు పంపాల్సిన మా చిరునామా.. regnews21@gmail.com
సంగ కుమార స్వామి
వాస్తు శాస్త్ర నిపుణులు
ఫోన్: 8501956999