poulomi avante poulomi avante

వాస్తు : ఇంటికి ఈశాన్యం తెరిచే ఉంచాలా?

ఇంటికి ఈశాన్యం తెరిచే ఉంచాలనీ.. నైరుతి వైపు మూసివేయడం మంచిదని వాస్తు (Vastu) ఎందుకు సూచిస్తుంది? నైరుతి దిశలో వాటర్ ట్యాంకులు, బరువైన వస్తువులు పెట్టుకోవాలని ఎందుకు చెబుతోంది? ఇందుకు శాస్త్రీయంగా ఏమైనా కారణం ఉందా? లేక ఇది ఒట్టి మూడనమ్మకమేనా?

చెక్కు చెదరని విశ్వాసంతో కొందరు.. భయంతో మరికొందరు వాస్తును నమ్ముతారు. నిర్మాణాలు కట్టేవారిది మరో ధోరణి. వాస్తు నిబంధనల్ని పాటించకపోతే అమ్ముకోవడం కష్టమనేది వీరి భావన. ఏదైనప్పటికీ పాటించే వారిలో చాలామందికి వాస్తు సూత్రాల వెనక శాస్త్రీయమైన కారణాలు తెలియవు. వాస్తు నిపుణులమని చెప్పుకునేవారిలో ఎక్కువ మందికి అస్సలే తెలియదు. నేచురల్ ఎనర్జీ.. అదే సానుకూల శక్తి. ప్రసరించే దిశను బట్టి సానుకూల శక్తి, ప్రతికూల శక్తి అని రెండు రకాలుంటాయి. భారతీయ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని ప్రకృతి శక్తులకు అనుగుణంగా ఇంటి నిర్మాణాన్ని సూచించేదే వాస్తు శాస్త్రం. మన దేశ పరిస్థితుల్ని బట్టి ఈశాన్య (నార్త్ ఈస్ట్) దిశ నుంచి గరిష్ఠ స్థాయిలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఈశాన్య దిశను మూసివేస్తే ఈ శక్తి మనకు దూరమవుతుంది. అందుకే, ఈశాన్య దిశను పూర్తిగా మూసివేయకూడదని వాస్తు చెబుతోంది.

సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడని మనకు తెలుసు. కచ్చితంగా చెప్పాలంటే నైరుతి (సౌత్ వెస్ట్ ) దిశలో అన్నమాట. అస్తమించే సూర్యకిరణాల తీక్షణ బాగా ఎక్కువ. అస్తమించే సూర్యకాంతిలో శరీరానికి హాని కలిగించే అతినీలలతోహిత కిరణాలు ఎక్కువుంటాయి. సాధారణంగా పడక గదులు ఈ దిశలోనే ఉంటాయి. ప్రతికూల శక్తిని అడ్డుకోవడానికే నైరుతి దిశను మూసివేయాలని.. బరువైన వస్తువుల్ని ఈ దిశలోనే ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఆరోగ్యానికి ఆలంబన..

వాస్తు శాస్త్రం ముఖ్య లక్ష్యం.. ఆరోగ్యం. మెదడుపైనా, శరీరం పైనా సూర్మరశ్మి, భూ ఆయస్కాంత శక్తి చూపే ప్రభావం అంతాఇంతా కాదు. జీవితంలో ఎక్కువ కాలం ప్రతికూల శక్తి కింద జీవించే వారికి ఆరోగ్యం మృగ్యమే. రోజంతా ఎర్రటి ఎండలో తిరిగితే ఏమవుతుంది? ప్రధాన ప్రాకృతిక శక్తులు ఐదు (పంచ భూతాలు) అయినా వాస్తు నాలుగు అంశాలకు పెద్దపీట వేస్తుంది.

మొదటిది, భూ ఆయస్కాంత శక్తి, వాస్తు శాస్త్రంలో దాదాపు 45 సూత్రాలు ఈ శక్తికి సంబంధించినవే. మన శరీరం అంతా రక్తమే. రక్తంలో ఉండేది హిమోగ్లోబిన్. అంటే, ఇనుము. ఇనుముపై ఆయస్కాంత ప్రభావం ఉంటుందనేది చిన్న పిల్లలకూ తెలిసిన విషయమే. శరీరంలో రక్త ప్రవాహాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది.
రెండోది, సౌరశక్తి. వాస్తు శాస్త్రంలో 40 సూత్రాలు ఈ శక్తికి సంబంధించినవే. భూమధ్య రేఖకు ఎంత దగ్గర్లో ఉంటే ప్రతికూల సౌరశక్తి ప్రభావం అంత ఎక్కువ ఉంటుంది.
మూడోది గురుత్వాకర్షణ శక్తి. వాస్తు శాస్త్రంలోని సుమారు 7-8 సూత్రాలు ఈ శక్తి గురించి వివరిస్తాయి. ఆధునిక సాంకేతక పరిజ్ణానం ఉపయోగిస్తే.. ఈ శక్తిని అధిగమించేలా నిర్మాణాలు చేపట్టడం సాధ్యమే.
ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు వంటి కృతిమ సాధనాల మీద‌ ఆధారపడటం తప్పనిసరి అయిన ఈ రోజుల్లో ప్రకృతి సిద్ధమైన వాయుశక్తిని నుంచి ప్రయోజనం పొందే అవకాశం తక్కువ.

అమెరికా.. మ‌న వాస్తు.. వేర్వేరు

వాస్తు శాస్త్రంలో సిరిసంపదల గురించి ప్రస్తావించింది. కొన్ని సూత్రాలు పాటిస్తే సంపద కలుగుతుందని సూచించింది. అందులో పరమార్థం ఏమీ లేదు. వాస్తు సూత్రాలు ఆరోగ్యానికి బాట వేస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనస్సు ఎంతో ఆరోగ్యంతో విలసిల్లుతుంది. ఆరోగ్యవంతమైన మస్తిష్కం మరింత సమర్థంగా పని చేయగల్గుతుంది. అంతే, ఇంతకు మించి ఈ సూత్రాల్లో రహస్యం ఏమీ లేదు. లక్షల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. వీరికి వాస్తుపై నమ్మకం ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వాస్తు శాస్త్రం ఒక్కటే. అది సూచించే దిశలు ఒక్కటే. అయినప్పటికీ, అన్ని దేశాలకు ఒకేలా వర్తించదు. మన దేశంలో ఈశాన్య దిశ నుంచి సానుకూల శక్తి ప్రసరిస్తూ ఉంటే మరో దేశంలో ఇదే దిశ నుంచి ప్రతికూల శక్తి ప్రసరించే అవకాశముంది. ఆయా ప్రాంతాల అక్షాంశ, రేఖాంశాలు, సూర్యుడు, భూగమనం, పవనాల దిశ ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని వాస్తుని అన్వయించుకోవాలి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles