Categories: Uncategorized

గురు జీవితం సంగీతమయం ఇల్లు రంగులమయం

  • ఖరీదైన గాయకుడు గురు రంధావాకు రంగులు అద్దుతున్న ఇల్లు

ఖరీదైన గాయకుడు గురు రంధావా తన జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. సంగీతంలో ఆయన కెరీర్ కోసం గురు తండ్రి భూమిని విక్రయించడం దగ్గర నుంచి ఇప్పుడు ఖరీదైన గాయకుడిగా, విలాసవంతమైన ఇంటిని కలిగి ఉండటం వరకు గురు విజయగాథ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఇల్లు ఆయన విజయ ప్రయాణాన్ని తెలియజేస్తుంది. గురు ఇల్లు ఆయన సంగీతంలా ఉర్రూతలూగిస్తుంది. గురుదాస్ పూర్ కు చెందిన గురు రంధావా.. డ్యాన్స్ మేరీ రాణీ, బేబీ గర్ల్ పటోలా, సూట్ సూట్ వంటి పాటలతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కళాఖండాలు, రంగులతో నిండిన విలాసవంతమైన ఇంటికి గర్విచంతగ్గ యజమాని. ఆయన ఇల్లు ఆయన విజయాన్ని నిర్వచిస్తుందు. రండి.. గురు ఇంటికి వెళ్లి ఓసారి చూసొద్దాం.

గురు ఇంటికి వెళ్లాక ఆయన తలుపు తెరవగానే.. ఫొటోలు, పెయింటింగ్ లు కలిగి ఉన్న నడక మార్గం కనిపిస్తుంది. హాల్ లోకి వెళ్లగానే.. గురు అవార్డులు, కొన్ని పుస్తకాలు, కొన్ని డెకర్ వస్తువులతో కూడిన భారీ షెల్ఫ్ చూస్తాం. గురు ఇల్లు విశ్రాంతి, వినోదంతో నిండి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే కళాత్మక వస్తువలతో గోడలు కనువిందు చేస్తాయి. అలాగే నారింజ, ఆకుపచ్చ, రాయల్ బ్లూ, లావెండర్ వంటి శక్తివంతమైన రంగులు మనసుకు హత్తుకుంటాయి. గురు తన స్నేహితులతో ఫిఫా ఆడే ప్రదేశం అదిరిపోతుంది. ఓ నీలిరంగు సోఫా, ఊదారంగు కుర్చీలు, గ్లాస్ కాఫీ టేబుల్, చెక్కతో చేసిన పురాతన ఓడతో హాయి గొలుపుతుంది. ఇక ఆ హాల్ కు ఉన్న పెద్ద కిటికీ నుంచి సుందరమైన గార్డెన్ కనిపిస్తుంది. ఆ కిటికీకి ముందు లావెండర్ రంగులో రెండు భారీ సింగిల్ సీటర్ సోఫాలు ఆ హాలుకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

‘మీ హృదయం ఉన్న చోటే మీ ఇల్లుంటుంది. మీరు ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా, ఎల్లప్పుడూ మీ ఇంటికి తిరిగి రావాలనే కోరుకుంటారు. మీ ఇంటి నుంచి మీకు లభించే శక్తి, ఆనందం ఎక్కడా కనిపించదు’ అని గురు పేర్కొన్నారు. ఆయన ఇల్లు సాధారణంగా ఉండదు. గురు సంగీతంలాగే ఉత్తేజకరంగా, కళాత్మకంగా ఉంటుంది. ఆయన సంగీతాన్ని ఆ ఇల్లు పూర్తిగా ప్రతిబింబిస్తుంది. తనకు అద్దాలు అంటే బాగా ఇష్టమని.. అవి తనను ఆలోచించేలా, అన్నీ ప్రతిబింబించేలా చేస్తాయని గురు చెప్పారు. ఈ కారణంతోనే గురు ఇల్లంతా బోలెడు అద్దాలు ఉంటాయి. అలాగే తన ఇంట్లో అందమైన రంగులు ఉండాలని కోరుకుంటున్నాని చెప్పారు.

అందుకే ఆయన ఇల్లంతా రంగులతో నిండి ఉంటుంది. గురు ఇంట్లో కనిపించే కళాఖండాలు కూడా రంగులతోనే నిండి ఉంటాయి. గురుకు కళాఖండాలు అంటే చాలా ఇష్టం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాఖండాలతో తన ఇంటిని నింపేస్తుంటారు. గురు ఇంట్లోని ప్రతి అంశం ఆయన కళాత్మక శక్తి, చైతన్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. డైనింగ్ ఏరియాలో రంగురంగుల కుర్చీలు, గోడలపై భారీ కళాకృతులతో కూడిన రౌండ్ టేబుల్ ఉంది. డైనింగ్ టేబుల్ వద్ద టీ కప్పు భారీ వాల్ పెయింటింగ్ కూడా ఉంది. చాయ్, భారీ సిల్హౌట్ లు, పెయింటింగ్స్ పై అతని ప్రేమను తెలియజేస్తుంది. గురు ప్రపంచవ్యాప్తంగా సేకరించిన అనేక రంగురంగుల కళాఖండాలుతో తన ఇంటిని నింపుతూనే ఉంటారు. వాక్ త్రూ మార్గం సైతం ఆయన, ఆయన జీవితాన్ని వివరించే ఫొటోలతోనే నిండి ఉంది. మొత్తానికి తన జీవితానికి రంగులు జోడించే అందమైన ఇల్లు గురు సొంతం.

This website uses cookies.