రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించిన దివాలా పరిష్కార ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి దివాలా బోర్డు ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) కొన్ని ప్రతిపాదనలు చేసింది. ప్రాజెక్టులను తప్పనిసరిగా రెరా కింద నమోదు చేయాలని పేర్కొంది. అలాగే దివాలా పరిష్కార ప్రక్రియలో ఐదు కీలక మార్పులు చేసింది. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి రిజిస్ట్రేషన్లు, సబ్ డీల్స్ ను కమిటీ ఆఫ్ క్రెడిటర్ల ఆమోదంతోనే చేయాలని సూచించింది. అలాగే ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక ప్లాన్ ను పరిశీలించే అంశంలో కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ కి అనుమతి ఇవ్వాలని పేర్కొంది. ఒకవేళ కేటాయింపుదారుడు ప్రాపర్టీ స్వాధీనం చేసుకుని ఉంటే, అది లిక్విడేషన్ ఎస్టేట్ లో భాగం కాకూడదని ప్రతిపాదించింది. పరిష్కార నిపుణుడు రెరా నిబంధనలకు లోబమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఈ సవరణలపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించేందుకు నవంబర్ 28 వరకు గడువు ఇచ్చింది.
This website uses cookies.