ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ సబర్బర్ వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవేలో తనకు చెందిన రెండు ఫ్లాట్లను రూ.15.25 కోట్లకు విక్రయించారు. ఒక్కొక్కటి 1324 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండు ఫ్లాట్లు ఒబెరాయ్ ఎక్స్ క్విసైట్ లోని 43వ అంతస్తులో ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్ కోసం రూ.91 లక్షల స్టాంపు డ్యూటీ అయింది. వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ ప్రాజెక్టులను బట్టి చదరపు అడుగుకు రూ.22,261 నుంచి రూ.25 వేల వరకు ధర పలుకుతోంది. ప్రస్తుతం అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు తమ పోర్ట్ ఫోలియోను వైవిద్యం చేసుకోవడం కోసం రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అమితాబ్ బచ్చన్, ఫారూక్ ఖాన్, దీపికా పదుకొనే, సోనమ్ కపూర్, అక్షయ్ కుమార్ వంటి నటులు రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టినవారిలో ఉన్నారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ గణాంకాల ప్రకారం గత నెలలో ముంబైలో 10,601 రిజిస్ట్రేషన్లు జరిగి రూ.835.32 కోట్ల ఆదాయం వచ్చింది. గత 11 ఏళ్లలో అక్టోబర్ లో నమోదైన రిజిస్ట్రేషన్లలో ఇదే అత్యధికం. ఇక ముంబైలో లగ్జరీ హౌసింగ్ అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు అన్ రాక్ తాజా నివేదిక వెల్లడించింది. 2022 తొలి తొమ్మిది నెలల్లో 20,820 లగ్జరీ ఇళ్లు అమ్ముడు కాగా, 2023 తొలి తొమ్మిది నెలల్లో ఇది 36,130 యూనిట్లకు చేరుకుంది.
This website uses cookies.