Categories: TOP STORIES

రెరా విల్లా ప్రాజెక్టు ఇదీ!

పదిహేనేళ్ల క్రితం ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో.. అక్కడి కొనుగోలుదారులు దాదాపు రెండు లక్షల కోట్ల మేరకు పెట్టుబడుల్ని వివిధ ప్రీలాంచ్ ప్రాజెక్టుల్లో పెట్టారు. అందులో కొన్నవారిలో సగం మందికి గృహ‌ప్ర‌వేశం చేయ‌గ‌లిగారు. కాక‌పోతే ఎక్కువ శాతం నాసిర‌క‌మైన ఫ్లాట్లే కావ‌డం గ‌మ‌నార్హం. మిగ‌తా వారికి నేటికీ సొంతిల్లు ద‌క్క‌లేదు. కొనుగోలుదారుల్నుంచి సొమ్ము తీసుకుని అపార్టుమెంట్ల‌ను క‌ట్ట‌ని వారిలో అధిక శాతం మంది డెవ‌ల‌ప‌ర్లు పోలీసు స్టేష‌న్లు, కోర్టులు, జైళ్లు చుట్టూ తిరుగుతున్నారు. ఆయా డెవ‌ల‌ప‌ర్ల కుటుంబాల ప‌రువు, మ‌ర్యాద‌లు మంట‌గ‌లిశాయి.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనూ కొంద‌రు మోస‌పూరిత డెవ‌ల‌ప‌ర్లు ఇదేవిధంగా యూడీఎస్‌, ప్రీలాంచ్ ప్రాజెక్టుల్ని విక్ర‌యిస్తున్నారు. మ‌రి, వీరి బారిన ప‌డ‌కుండా.. క‌ష్టార్జితాన్ని బూడిద‌లో పోసిన ప‌న్నీరు కాకూడ‌దంటే.. ప్ర‌తిఒక్క‌రూ రెరా అనుమ‌తి గ‌ల ప్రాజెక్టుల్ని మాత్ర‌మే కొనుగోలు చేయాలి. మ‌రి, ఈ వారం నుంచి రియ‌ల్ ఎస్టేట్ గురు ప్ర‌తివారం.. రెరా అనుమ‌తి గ‌ల ప్రాజెక్టుల పూర్తి వివ‌రాల్ని అంద‌జేస్తుంది. కాబ‌ట్టి, మీరు నిశ్చింత‌గా మీ సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోండి.

ప్రాజెక్టు పేరు: గిరిధారి ప్రాస్పెరా కౌంటీ
రెరా కంటే ముందు విల్లాల్ని అమ్మేలేదు
లొకేష‌న్‌: కిస్మ‌త్‌పూర్‌
స్థ‌ల విస్తీర్ణం: 12.9 ఎక‌రాలు
సంఖ్య‌: 98
బిల్డ‌ప్ ఏరియా 4750-6150 చ‌.అ.
నిర్మాణం: 60 శాతం పూర్తి
పూర్తి?: 2023 డిసెంబ‌రు
ధ‌ర‌: రూ.14,000 (చ‌.అ.కీ.)

This website uses cookies.