నిత్యం సందడిగా ఉండే బాంద్రా నడిబొడ్డున ప్రతి మూలలోనూ తనదైన కథను చెప్పేలా ఉన్న నటుడు జావేద్ జాఫేరి కొత్త ఇల్లు ఆయన వ్యక్తిగత ప్రయాణానికి, నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ముంబైలోని సముద్రతీర ప్రాంతంలో అద్భుతమైన ప్రదేశంలో ఉన్న జావేద్ ఇల్లు.. ఆయన చిరునామా మాత్రమే కాదు, కుటుంబ సంబంధాలకు, కళాత్మక నైపుణ్యానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ‘ఇంతకుముందు బాంద్రాతో నా సమస్య ఏంటంటే.. ఎక్కడపడితే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నందున..
అన్నీ ఒకదానికి మరొకటి చాలా దగ్గరగా ఉన్నందున.. మనం తలుపు తెరిచి ఓ కప్ పంచదార అడగొచ్చు. కానీ ఈ స్థలం చూసినవెంటనే దీనితో ప్రేమలో పడిపోయాను’ అంటూ జావేద్ తన అంతరంగాన్ని పంచుకున్నారు. వెచ్చదనం, గాంభీర్యాన్ని వెదజల్లే ఇంటికోసం చూస్తున్న జావేద్ కల.. కేయూఎల్ ఎక్స్ స్టూడియోకి చెందిన కుష్ భయానీ,, పోలీ ఫ్లోర్స్ ఇండియా సహకారంతో నిజమైంది.
మధ్యదరా డిజైన్ సూత్రాల నుంచి ప్రేరణ పొందిన జావేద్ 7వేల చదరపు అడుగుల అభయారణ్యం.. నిర్మలమైన అరేబియా సముద్రాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఇంటీరియర్ మొత్తం కాలానుగుణమైన అధునాతనను గుర్తు చేస్తుంది. వ్యక్తిగత కళాఖండాలు, ప్రతిష్టాత్మకమైన మెమెంటోలు మైమరిపించేలా ఉంటాయి. కుటుంబంలోని వ్యక్తిగత అభిరుచుల సామరస్య సమ్మేళనాన్ని హైలైట్ చేస్తూ.. ‘ఈ స్థలం మూడు విభిన్న సున్నితత్వాల కలయిక’ అని జావేద్ వ్యాఖ్యానించారు.
డిజైన్ తత్వశాస్త్రంలో ప్రధానమైనది కుటుంబ చరిత్రతోపాటు వారి అభిరుచులను ప్రతిఫలించే వ్యక్తిగత అంశాలను చేర్చడం. చేతితో తయారు చేసిన చెక్క ఫర్నిచర్ నుంచి క్లిష్టమైన నమూనా కలిగిన రగ్గులు, అందమైన గోడల వరకు అన్నీ అందులో ప్రతిబింబిస్తాయి. కుటుంబ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇంట్లోని ప్రతి మూలను జాగ్రత్తగా నిర్వహించాం’ అని కుష్ భయానీ వివరించారు.
ఖరీదైన గృహోపకరణాలు, సహజ పదార్థాలతో అలంకరించి ఉన్న నివాస స్థలాలు ఎంతో ఆహ్లాదకరంగా, విశ్రాంతిమయంగా ఉంటాయి. విశాలమైన రీడింగ్ కార్నర్, చక్కని బుక్‌షెల్ఫ్, జ్ఞాపికల వంటివి రోజువారీ సందడి మధ్య నిశ్శబ్ద క్షణాలకు అభయారణ్యంగా అనిపిస్తాయి. జ్ఞాపకాలు అనేవి అతుకులు లేని మార్గాన్ని కనుగొంటాయని జావేద్ పేర్కొన్నారు. కుటుంబ బంధాలు, ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను పెంపొందించడంలో స్పేస్ పాత్ర చాలా కీలకమన్నారు.
జావేద్ పిల్లలు మీజాన్, అలవియా కోసం వారి ఇల్లు అభయారణ్యం, ప్రేరణ రెండింటినీ అందించేలా ఉంటుంది. సౌందర్యంపై ఆసక్తితోపాటు ఇంటర్నెట్ సేవీ అయిన అలవియా కోసం.. ఆమె కంటెంట్ సృష్టికి అవసరమైన పుష్కలమైన సహజ కాంతితో కూడిన స్థలాన్ని ఏర్పాటు చేశారు. డైనింగ్ టేబుల్ చుట్టూ కుటుంబ సభ్యులతో పంచుకున్న క్షణాలను మీజాన్ ఎంతో ఆనందంగా వెల్లడిస్తారు. ఇది వారి కొత్త జీవనశైలికి మూలస్తంభంగా ఉండటంతోపాటు ఒంటరిగా జీవించడం వంటి అంశాలకు దూరంగా ఉండేలా చేస్తుంది. ఇక బాంద్రాపై సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు జావేద్ టెర్రస్ లో సేద తీరతారు.
వారి టెర్రస్ అనేది తరాలు కలిసి ఆనందమయ క్షణాలను, గాథలను పంచుకునే ప్రదేశంగా ఉంటుంది. కుటుంబం కంటే తాను ఎంచుకునేది ఏదీ లేదని జావేద్ స్పష్టంచేశారు. భవిష్యత్తును ఆలింగనం చేసుకుని గతానికి నివాళి అర్పించే ఆధునిక అద్భుతమం తన కొత్త ఇల్లని పేర్కొన్నారు. జావేద్ జాఫేరి బాంద్రా స్వర్గధామంలోని ప్రతి మూలలో ప్రేమ, వారసత్వం, చక్కగా జీవించిన జీవితపు తాలూకు కథలు గుసగుసలాడుతున్నాయి.
This website uses cookies.