Categories: TOP STORIES

అంద‌జేసిన రెండేళ్ల‌కే ఊడిన జైన్ ప్రాజెక్టు పైక‌ప్పు

  • సీలింగ్ ఊడిపోయిందని బిల్డర్ పై ఫిర్యాదు

అపార్ట్ మెంట్ లో సీలింగ్ ఊడిపోవడంతో సదరు బిల్డర్ పై చర్యలు తీసుకోవాలని నివాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై వడపళనిలో జైన్ హౌసింగ్ అండ్ కన్ స్ట్రక్షన్ సంస్థ జైన్స్ వెస్ట్ మినిస్టర్ పేరుతో నాలుగు బ్లాకుల్లో 620 ఫ్లాట్లతో ఓ ప్రాజెక్టు చేపట్టి 2016లో పూర్తి చేసింది. అనంతరం 464 ఫ్లాట్లలోకి యజమానులు వచ్చి నివసించడం ప్రారంభించారు. అయితే, రెండేళ్లలోనే భవనంలో లీకేజీలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ‘బి’ బ్లాకులోని ఓ ఫ్లాటులో సీలింగ్ ఊడి పడింది. ఈ ఘటనలో అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన నలుగురు పిల్లలు తృటిలో దీని నుంచి తప్పించుకున్నారు. గత నెలలో మరో ఫ్లాట్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ నేపథ్యంలో అపార్ట్ మెంట్ నాణ్యత సరిగా లేదని పేర్కొంటూ జైన్స్ వెస్ట్ మినిస్టర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, భవనంలో మరమ్మతు పనులు చేపట్టామని, ఎప్పటికప్పుడు వాటిని చేస్తున్నామని జైన్ హౌసింగ్ అండ్ కన్ స్ట్రక్షన్స్ ఎండీ సందీప్ తెలిపారు.

This website uses cookies.