Categories: TOP STORIES

రీట్‌, ఇన్విట్‌ లపై మోజు.. గతేడాది రూ.11,474 కోట్ల పెట్టుబడులు

రియల్‌ ఎస్టే ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్ మెంట్ట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్‌) పట్ల పెట్టుబడిదారులకు మోజు పెరుగుతోంది. వీటిపై వారికి అవగాహన పెరుగుతుండటంతో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. 2023లో రీట్‌, ఇన్విట్‌లలోకి రూ.11,474 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2022లో వచ్చిన రూ.1,166 కోట్లతో పోలిస్తే పది రెట్ల వృద్ధి గతేడాది నమోదైంది. సెబీ తీసుకున్న చర్యలు, ఆకర్షణీయమైన రాబడులు వీటి దిశగా ఇన్వెస్టర్లను ప్రోత్సహిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2024లో కూడా ఇందులో భారీగా పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వడ్డీ రేట్లను తగ్గించే చర్యలు చేపట్టొచ్చని, దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసే వారికి రీట్‌, ఇన్విట్‌లు ఆక‌ర్షణీయంగా మారతాయని పేర్కొంటున్నారు.

రీట్‌, ఇన్విట్‌ లలోకి 2020లో రూ.29,715 కోట్ల పెట్టుబడులు రాగా, 2021లో రూ.17,641 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 23 రిజిస్టర్డ్‌ ఇన్విట్‌లు, ఐదు రీట్‌లు ఉన్నాయి. వీటి నిర్వహణలో మొత్తం రూ.30వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రీట్‌ల ద్వారా వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల్లో, ఇన్విట్‌ల ద్వారా ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.

This website uses cookies.