Categories: TOP STORIES

చైనా త‌ర‌హాలో.. మ‌నం మెట్రోను డెవ‌ల‌ప్ చేయ‌లేమా?

  • రోడ్డు మీదే వెళ్లే మెట్రో రైలు
  • సాధ్యం చేసి చూపెట్టిన చైనా
  • ఎల‌క్ట్రిక్ స‌పోర్టుతో న‌డిచే ఐఆర్‌టీ మెట్రో
  • ఇదే క‌దా నెట్ జీరో సిటీ అంటే!

కొత్త కొత్త ఇన్వెన్షన్స్‌తో ప్రపంచ దేశాలకు చైనా నిద్ర లేకుండా చేస్తోంది. ఆర్కిటెక్చర్‌, కన్‌స్ట్రక్షన్‌, వెహికల్స్‌ అంటూ రోజుకో సెగ్మెంట్‌లో అద్భుతాలు సృష్టిస్తోంది. నీటిలో నడిచే కార్లైనా.. డ్రైవర్‌ లేకుండా గాల్లో ఎగిరే ఎయిర్‌ ట్యాక్సీలైనా.. పట్టాలు లేకుండా నడిచే రైల్లైనా..! ఆగండగండి- ట్రాక్స్‌ లేకుండా ట్రైన్సా..! ఇదెలా సాధ్యం..? అని ఆశ్చర్యపోతున్నారా..? అయితే చైనా రైల్వే సిస్టమ్‌ను చూడండి. బుల్లెట్‌ ట్రైన్స్‌, డ్రైవర్‌ లెస్‌ మోనో రైల్స్‌ ఇప్పుడు పట్టాలు లేని మెట్రో ట్రైన్స్‌ అంటూ టెక్నాలజీని డెవలప్మెంట్‌కి వాడుకుంటే రిజల్ట్స్‌ ఎలా ఉంటుందో చేతల్లో చూపిస్తోంది. ఆర్కిటెక్చర్‌, కన్‌స్ట్రక్షన్‌, వెహికల్స్‌ ఇలా సెగ్మెంట్‌ ఏదైనా వెస్ట్‌ను మించి చైనా ఎలా అద్భుతాలు చేయగలుగుతుంది..? అసలు చైనాకు మాత్రమే ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయ్‌…?

రైలు ఎలా వెళుతుంది..? ఆ మాత్రం తెలీదా..! పట్టాలపై వెళుతుంది. సిగ్నలింగ్‌ సిస్టమ్‌, లోకో పైలెట్‌, జంక్షన్స్‌ అక్కడక్కడా క్రాసింగ్‌ గేట్స్‌ ఇలా రైల్వేస్‌ అంటే పెద్ద నెట్‌ వర్కే ఉంటుంది బ్యాక్‌ఎండ్‌లో. అదే మెట్రో రైళ్లైతే అయితే భూ సేకరణ చేపట్టాలి. స్ట్రాంగ్‌ పిల్లర్లు వేయాలి. సంవత్సరాల తరబడి జరుగుతుంటాయి ఈ పనులన్నీ. మెట్రో ట్రైన్‌ అందుబాటులోకి వచ్చేలోగా ట్రాఫిక్‌ జామ్లతో రోడ్ల మీద వెళ్లేవారి కష్టాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత బెస్ట్‌. ఇది మన దేశంలో పరిస్థితి. కానీ పక్కనే ఉన్న చైనా- రవాణా రంగంలో సంచలనాల మీద సంచనాలు సృష్టిస్తోంది.

మీరు ఎప్పుడైనా రోడ్ల మీద నడిచే రైళ్లు చూశారా..? ట్రామ్‌ ట్రైన్స్‌ ఉన్నాయిగా అంటారా..! వాటికి పట్టాలు ఉంటాయ్‌. కానీ ట్రాక్స్‌ లేకుండా రోడ్ల మీద బస్సుల్లా తిరిగే ట్రైన్స్‌ చూశారా..? ఇదేదో జేమ్స్‌బాండ్‌ మూవీస్‌లో చూపించే కొత్త టెక్నాలజీ కాదు. చైనా రోడ్ల మీద కనిపించే ఫాంటసీ లాంటి రియాల్టీ. అవును ట్రాక్స్‌ లేకుండా టెక్నాలజీ నావిగేషన్‌ ఆధారంగా.. డ్రైవర్స్‌తో కూడా పని లేకుండా మెలికలు తిరుగుతూ డెస్టినేషన్‌కి వెళుతుంటాయి ఐఆర్‌టీగా పిల్చే ఈ ఇంటెలిజెంట్‌ రైల్‌ ట్రాన్సిట్‌లు. ఈ రైళ్లు డ్రాగన్‌ కంట్రీ రైల్వే నెట్‌ వర్క్‌లో న్యూ అడిషన్‌.

ఎలక్ట్రిక్‌ సపోర్ట్‌తో నడిచే ఐఆర్‌టీలకు ఎలాంటి ట్రాక్స్‌ అక్కర్లేదు. గంటకు 60 మైళ్ల వేగంతో నడిచే ఐఆర్‌టీల్లో ఒక్కో కోచ్‌లో వంద మంది ప్యాసింజర్లు ప్రయాణించవచ్చు. రెగ్యులర్‌ బస్‌లతో పొల్చితే ఈ సంఖ్య పదింతలు ఎక్కువ. ఐఆర్‌టీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గ్రౌండ్‌ కమ్యూనికేషన్‌ సిగ్నల్‌ సిస్టమ్‌. ట్రాఫిక్‌ లైన్‌ ఇంటర్‌ సెక్షన్‌లోకి రైలు చేరుకోగానే ట్రాఫిక్‌ లైట్‌ బేస్‌ స్టేషన్‌ కంట్రోల్‌ కమాండ్స్‌తో ఈ ఐఆర్‌టీలు నడుస్తాయ్‌. అంటే రెడ్‌ లైట్‌ పడినప్పుడు ఆగడం.. గ్రీన్‌ లైట్‌ పడగానే మూవ్‌ అవడం అన్నమాట. డ్రైవర్‌తో పని లేని ఐఆర్‌టీలు- వర్చువల్‌ ట్రాక్‌ ఫాలోయింగ్‌ టెక్నాలజీ అంటే రోడ్‌ మీద ఉండే ట్రాఫిక్‌ లైన్ల ఆధారంగా ఇవి పరుగులు పెడుతుంటాయ్‌. పైగా పొల్యూషన్‌ ఉండదు కాబట్టి ఎకో ఫ్రెండ్లీ కూడా.

మ‌న దేశం ఎక్క‌డ?

చైనా గొప్ప సరే..! మరి మనం ఎక్కడ..? వందే భారత్‌ ట్రైన్స్‌, ఫాస్ట్‌ ట్రైన్స్‌ అంటూ ఇండియా ఇంకా ట్రయల్‌ రన్స్‌ దగ్గరే స్టక్‌ అయింది. గొప్పగా చెప్పే ఆ రైళ్లు కూడా ప్రమాదాల బారిన పడి దెబ్బ తింటుండటంతో వాటి నాణ్యత మీదే అనుమానాలు వస్తున్నాయ్‌. డ్రాగన్‌ కంట్రీ మాత్రం అసలు ట్రైన్స్‌ని ఎన్ని రకాలుగా నడపవచ్చు..? ఏ పద్ధతుల్లో కొత్త వాటిని కనిపెట్టొచ్చు.. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ని ఇంకెంత ఈజీ చేయొచ్చనే ఆలోచనలతో దూసుకెళ్తోంది. ఈ థాట్‌ ప్రాసెస్‌ని మన ప్రభుత్వాలు ఎందుకు అడాప్ట్‌ చేసుకోవు అనేదే ప్రశ్న..? హైద్రాబాద్‌లో మెట్రో సెకండ్‌ ఫేజ్‌కి రెడీ అవుతోంది కదా రేవంత్‌ ప్రభుత్వం ఈ తరహా టెక్నాలజీని ఎందుకు అందిపుచ్చుకోకూడదు..?

టెక్నాలజీని వాడే విషయంలో జపాన్‌ తర్వాతే ఎవరైనా అనుకుంటాం. కానీ చైనా ఈ అభిప్రాయాన్ని మార్చేసి చాలా సంవత్సరాలే అయింది. సాంకేతికతను ఎలా వాడుకోవాలో వరల్డ్‌ కంట్రీస్‌కి తన ఇన్నోవేషన్స్‌తో ఎప్పటికప్పుడు డెమోస్‌ ఇస్తూనే ఉంది డ్రాగన్‌ కంట్రీ. వాళ్ల ఆవిష్కరణలు చూసి అబ్బో అని కళ్లు తేలేయడం తప్ప అలా మనం ఎందుకు ఆలోచించలేం అని మాత్రం ప్రశ్నించుకోం. అందుకే వాళ్లు అడ్వాన్స్‌ టెక్నాలజీతో ప్రపంచాన్ని ఏలేయడానికి అమెరికాతో పోటీ పడుతుంటే.. ఇండియన్‌ గవర్నమెంట్‌ మాత్రం ఫ్యూచర్‌ గురించి ఆలోచించకుండా చారిత్రక విషయాలని తవ్వి తీసి ఆ గొడవల్లో చలి కాచుకొంటోంది. కాకపోతే ఇక మీదైనా ప్రభుత్వాలు అడ్వాన్స్డ్‌గా థింక్‌ చేయొచ్చుగా అని ఆశపడేవారు ఎందరో.

హైద‌రాబాద్‌లో అసాధ్య‌మా?

హైద్రాబాద్‌లో త్వరలో మెట్రో రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయ్‌. రూట్‌ మ్యాప్‌ రెడీ చేశారు. భూసేకరణ దగ్గరే పీఠముడి పడుతోంది. స్థల సేకరణ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టి.. టెండర్ల పేరుతో సమయం వృధా చేసే బదులు రోడ్ల మీద నడిచే ఇలాంటి ఐఆర్‌టీల గురించి ఎందుకు ఆలోచించకూడదు..? పైగా ట్రెడిషనల్‌ మెట్రో సిస్టమ్‌తో కంపేర్‌ చేస్తే దీనికయ్యే ఖర్చు కూడా తక్కువే. కాలుష్యరహితం కాబట్టి సీఎం పదే పదే చెబుతోన్న నెట్‌ జీరో సిటీకి తన వంతు సాయం చేస్తుంటాయి ఇలాంటి మెట్రో ట్రైన్స్‌. పెరిగిపోతున్న జనాభాకి..

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీద ఆధారపడే వారికి వీలైనన్ని సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల ధర్మం. మీ కోసం ఇంత చేశాం.. అంత చేశాం అని గొప్పలు చెప్పే బదులు- తక్కువ ఖర్చులో ఎక్కువ ఇన్‌ఫ్రా, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఫెసిలిటీస్‌ అందిస్తే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు. ఏఐ సిటీ, ఐటీ పార్క్స్‌, నెట్‌జీరో సిటీ అంటూ సాంకేతికత చుట్టూతా తిరుగుతోంది తెలంగాణ సీఎం చెబుతోన్న ఫోర్త్‌ సిటీ. కనీసం అందులో అయినా ఇలాంటి అడ్వాన్స్డ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ గురించి ఆలోచిస్తే ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారు..!

This website uses cookies.