ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయించి.. పారిజాత డెవలపర్స్ బయ్యర్లను బురిడీ కొట్టించిన తాజా సంఘటన వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్‌లో పారిజాత ఆర్మూర్ సిటీ అనే ప్రాజెక్టులో.. తక్కువ ధరకే ఫ్లాట్లు అంటూ.. అమాయక బయ్యర్లను ఈ సంస్థ బుట్టలో వేసుకుంది. పలువురు ఏజెంట్ల ద్వారా ఒక్కో వ్యక్తి నుంచి పదహారు నుంచి 25 లక్షల దాకా వసూలు చేసింది. వారికి నమ్మకం కలిగించేందుకు ఒక గుంట భూమిని కూడా రిజిస్టర్ చేసిచ్చింది. అయితే, 2021లో కడతామన్నా అపార్టుమెంట్‌కు సంబంధించిన పనులు ఇప్పటివరకూ పూర్తి కాలేదు.
2025 వచ్చినా ఇంతవరకూ కట్టింది లేదు.. సొమ్ము వెనక్కి ఇవ్వమంటే అడిగితే.. చెల్లని చెక్కులిచ్చి పారిజాత డెవలపర్స్ సతాయిస్తున్నాడు. ఇలా సుమారు నలభై మంది దాకా ఫ్లాట్ల కోసం సొమ్ము కట్టి మోసపోయిన ఉదంతం ఇటీవల రెజ్ టీవీ దృష్టికొచ్చింది. తమను ఈ సంస్థ ఎలా మోసం చేసిందో తెలియజేస్తూ కొందరు బాధితులు రెజ్‌టీవీని సంప్రదించారు. తాము కట్టిన సొమ్ము అడిగితే.. రేపు మాపు అంటూ పారిజాత హోమ్స్ కాలయాపన చేస్తూ.. కాళ్లరిగేలా తిప్పించుకుంటుందని బయ్యర్లు వాపోతున్నారు. మొత్తానికి, పారిజాత సంస్థ బాధితులు వందల సంఖ్యలోనే ఉంటారని సమాచారం. మరి, తమ లాంటి వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
This website uses cookies.