Categories: TOP STORIES

ఇదీ ఆకాశ‌హ‌ర్మ్య‌మే..

ప్రపంచమంతా ప్రస్తుతం స్కై స్క్రేపర్స్‌ కన్‌స్ట్రక్షన్‌ మీదే దృష్టి పెట్టింది. రెసిడెన్షియల్‌- కమర్షియల్‌ అవసరం ఏదైనా బహుళ అంతస్థుల భవనాలకు డిమాండ్‌ కనిపిస్తోంది అన్నిచోట్లా. మన దేశంలో.. హైద్రాబాద్‌ లాంటి నగరాల్లో ఇప్పడు ఈ తరహా ప్రాజెక్ట్‌లకే డిమాండ్‌. వెస్ట్రన్‌ కంట్రీస్‌లో ఈ ఆకాశహర్మ్యాల కల్చర్‌ మొదలైనప్పటికీ.. వాటి ఆర్కిటెక్చర్‌ను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లిన ఘనత మాత్రం కచ్చితంగా చైనాదే. నిర్మాణ రంగంలో చైనా చేసినన్ని అద్భుతాలు మరే దేశం చేసి ఉండదు. పైగా స్కై స్క్రేపర్స్‌ అంటే నిలువుగా ఆకాశంలోకి దూసుకెళ్లేట్టట్లు ఉంటాయనే అనుకొంటాం. కానీ చైనా మాత్రం ఆకాశహర్మ్యాల నిర్వచనాన్నే మార్చేసింది. భారీ భవనాలు అంటే నిలువుగానే కాదు గుండ్రంగానూ ఉంటాయని కట్టి చూపించింది.

చైనాలో ఉన్న యునిక్‌ బిల్డింగ్స్‌లో ఒకటి గ్వాంగ్జౌ సర్కిల్‌. ఇటాలియన్‌ ఆర్కిటెక్ట్‌ జోసెఫ్‌ డి పాస్‌క్వేల్‌ డిజైన్‌ చేసిన ఈ 33 అంతస్థుల సర్కిలర్‌ బిల్డింగ్‌ని చైనాలోని గ్వాంగ్జౌ నగరంలో నిర్మించారు. వృత్తాకారంలో ఉండే స్కై స్క్రేపర్‌ 453 అడుగుల ఎత్తు.. 164 అడుగుల డయామీటర్లు.. మధ్యలో 157 అడుగుల వెడల్పైన వృత్తంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్కిలర్‌ స్కై స్క్రేపర్‌గా గుర్తింపు పొందింది. ఇందులో మొత్తం ఫ్లోర్‌ ఏరియా 9 లక్షల 15 వేల చదరపు అడుగులు. ప్లాస్టిక్‌- రా మెటీరియల్‌ ట్రేడింగ్‌ ఎక్స్ఛేంజ్‌ సంస్థల హెడ్‌క్వార్టర్స్‌ ఈ బిల్డింగ్‌ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయ్‌. 2013లో నిర్మించిన ఈ సర్కిల్‌ స్కై స్క్కేపర్‌ గ్వాంగ్జౌ ఆర్కిటెక్చర్‌ సింబల్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించింది.

This website uses cookies.