poulomi avante poulomi avante

121 మందిలో..”క్రియేట్” విజేత‌లెవ‌రు?

  • రాష్ట్రంలో ప్ర‌ప్ర‌థ‌మంగా క్రెడాయ్ తెలంగాణ కాన్‌క్లేవ్‌
  • డెవ‌ల‌ప‌ర్ల‌కు ప్రోత్సాహం.. క్రియేట్ అవార్డులు
  • నిర్మాణ రంగానికి దిశానిర్దేశం చేసే గైడ్‌కు రూప‌క‌ల్ప‌న‌
  • ప్రీలాంచుల్ని అరిక‌ట్టే బాధ్య‌త ప్ర‌భుత్వానిదే

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌)

నాణ్య‌మైన నిర్మాణాల్ని చేప‌ట్టే డెవ‌ల‌ప‌ర్ల‌ను ప్రోత్స‌హించేందుకు క్రియేట్ అవార్డ్స్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని క్రెడాయ్ తెలంగాణ అధ్య‌క్షుడు ముర‌ళీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మం డిసెంబ‌రు 23న హెచ్ఐసీసీలో జ‌రుగుతుంద‌న్నారు. అదే రోజు ప్ర‌త్యేకంగా రాష్ట్ర స్థాయి కాన్‌క్లేవ్ కార్య‌క్రమాన్ని చేప‌డుతున్నామ‌ని.. రాష్ట్ర‌వ్యాప్తంగా దాదాపు ప‌ద్నాలుగు ఛాప్ట‌ర్ల నుంచి 850 మంది డెవ‌ల‌ప‌ర్లు పాల్గొంటార‌ని వెల్ల‌డించారు. క‌రోనా త‌ర్వాత నిర్మాణ రంగం ముఖ‌చిత్రం పూర్తిగా మారిపోయిన నేప‌థ్యంలో.. బిల్డ‌ర్ల‌కు అన్నివిధాలుగా ఉప‌యోగ‌ప‌డేందుకు ఒక పుస్త‌కాన్ని రూపొందించామ‌ని.. దీన్ని పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ డిసెంబ‌రు 23న విడుద‌ల చేస్తార‌ని తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వ్య‌క్తులు హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డేందుకు దృష్టి సారిస్తున్నార‌ని.. వ‌చ్చే 20, 30 ఏళ్ల దాకా భాగ్య‌న‌గ‌ర నిర్మాణ‌ రంగానికి ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. సూర్యాపేట్‌, రామ‌గుండం, సంగారెడ్డి, మేడ్చ‌ల్ వంటి న‌గ‌రాల్లో కొత్త క్రెడాయ్ సంఘాల్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చురుకైన పరిపాలనతో పాటుగా శక్తివంతమైన, ముందు చూపున్న నాయకత్వం కారణంగా అభివృద్ధి పరంగా తెలంగాణా రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. జాతీయ‌, అంత‌ర్జాతీయ సంస్థ‌ల రాక‌తో ఆఫీస్‌ స్పేస్ విభాగానికి ఎక్క‌డ్లేని గిరాకీ పెరిగింది. వివిధ దేశాల‌కు చెందిన పెట్టుబ‌డుల్ని ఆక‌ర్షించ‌డంలో అగ్ర‌గామిగా ఉండ‌టంతో పాటు ఉపాధి కల్పన పరంగానూ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఐటీ రంగంలో కొత్త‌గా 46,489 ఉద్యోగాలొచ్చాయి. 2020–21 ఆర్ధిక సంవత్సరంలో రెండున్నర రెట్ల వృద్ధి పరోక్షంగా ఉద్యోగ మార్కెట్‌లో కనిపించింది. ఎల‌క్ట్రానిక్స్ రంగంలో 1.5 లక్షల ఉద్యోగాలు వ‌చ్చాయి. టీఎస్‌ఐఐసీ ఇప్పటికే 10 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. 810 ఎకరాల్లో 453 పరిశ్రమలకు కేటాయించి పెట్టుబడుల్ని ప్రోత్స‌హించింది. రాష్ట్ర వ్యాప్తంగా స్టార్టప్పులు వృద్ధి చెందేందుకు తగిన వాతావరణం ఏర్ప‌టైంది. తెలంగాణ జాతీయ జీడీపీకి 5% తోడ్పాటును అందిస్తుంది. భారతదేశపు ఐటీ ఎగుమతుల్ని ప‌రిశీలిస్తే.. తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఐటీ/ఐటీఈఎస్‌ ఎగుమతుల పరంగా 13% వార్షిక వృద్ధి రేటును న‌మోదు చేశాం. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1.45లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు న‌మోద‌య్యాయి.

రాష్ట్ర ప్ర‌భుత్వం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి అత్యధిక తోడ్పాటునూ అందిస్తోంది. డెవలపర్లు ఈ సవాల్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉండటంతో పాటుగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో మా సభ్య డెవలపర్ల ప్రయత్నాలను గుర్తించేందుకు, మా 3వ ఎడిషన్ క్రియేట్‌ అవార్డుల్ని అంద‌జేస్తున్నాం. దీని ద్వారా అసాధారణ తోడ్పాటును అందించ‌డంతో పాటుగా ఆవిష్కరణలు చేస్తూనే కోవిడ్‌–19 సంక్షోభ సమయంలో తమ నిబద్ధతను చాటి పరిశ్రమలో నూతన ప్రమాణాల్ని సృష్టించిన వారిని గుర్తిస్తూ టీఎస్‌ కాంక్లేవ్ లో స‌త్క‌రిస్తాం.

121 నామినేషన్లు.. 
ఈ ఏడాది క్రియేట్ అవార్డ్స్ కార్య‌క్ర‌మానికి సుమారు 121 నామినేష‌న్లు వ‌చ్చాయ‌ని క్రెడాయ్ తెలంగాణ ఛైర్మ‌న్ రామ‌చంద్రారెడ్డి తెలిపారు. గ‌తేడాది కేవ‌లం 103 ప్రాజెక్టుల‌కే ద‌ర‌ఖాస్తులు రాగా.. ఈసారి ఈ సంఖ్య పెరిగింద‌న్నారు. కేవ‌లం ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ వ‌చ్చిన త‌ర్వాతి ప్రాజెక్టులే క్రియేట్ అవార్డుల కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు అర్హత‌గా నిర్ణ‌యించామ‌న్నారు. కొనుగోలుదారుల‌కు మెరుగైన గృహాల్ని అంద‌జేసిన డెవ‌ల‌ప‌ర్ల‌కే తుది అవార్డులు ల‌భిస్తాయ‌ని తెలిపారు. అవార్డులు రానివారు వ‌చ్చేసారైనా తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తార‌ని చెప్పారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే..

‘‘రియల్‌ ఎస్టేట్‌ రంగ గొంతుక క్రెడాయ్‌. రియల్‌ ఎస్టేట్‌ రంగం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిల్లో విధానాలు మరియు మార్గదర్శకాల రూపకల్పనలో ప్రభుత్వాలతో అతి సన్నిహితంగా పనిచేస్తుంది. తెలంగాణ రియల్‌ఎస్టేట్‌ రంగంలో సంస్కరణలు తీసుకు రావడంలో ముందుండటంతో పాటుగా టీఎస్‌–బీపాస్ వంటి కార్యక్రమాల రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించింది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సమగ్రమైన భూ రికార్డుల నిర్వహణ పోర్టల్‌ ధరణి ఇప్పుడు స్పష్టంగా భూ రికార్డులను నిర్వచించడంతో పాటుగా ఆదాయాన్ని క్రమబద్దీకరిస్తుంది. ఈ కార్యక్రమాలు అతి సులభంగా వ్యాపార నిర్వహణకు తోడ్పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చురుకైన మరియు విజనరీ పాలసీలు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల్లో తాజా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. అలాగే వేగంగా పారిశ్రామికీకరణ సాధ్యం కావడంతో పాటు ఉపాధి కల్పన సాధ్యమైంది. వృద్ధి కూడా వేగవంతం అయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా వ్యవసాయ రంగంలో క్రమబద్దీకరించిన విధానంతో పాటుగా సాగు భూమి కూడా పెరిగింది. రైతు బంధు పథకం ద్వారా వ్యవసాయ రంగానికి తోడ్పాటు లభించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సైతం పురోగతి సాధిస్తుంది. ఐటీ, ఐటీఈఎస్‌, పరిశ్రమలు కాకుండా తెలంగాణా ఆర్థిక వ్యవస్ధ ఇప్పుడు వ్యవసాయ, సంబంధిత రంగాల కారణంగా స్థిరంగా వృద్ధి సాధిస్తుంది. జాతీయ స్ధాయిలో కేవలం 3% వృద్ధి ఈ రంగాల్లో నమోదవుతుంటే ఇక్కడ 20.9% నమోదైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధికి తోడ్పడటంతో పాటుగా రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు డిమాండ్‌ సైతం వృద్ధి చేస్తుంది.

ఔత్సాహికుల‌కు ఉప‌యోగం..

నిర్మాణ రంగంలో కొత్త‌గా ప్ర‌వేశించే వారితోనే యూడీఎస్‌, ప్రీలాంచ్ స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతున్నాయ‌ని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ (ఎల‌క్ట్‌) ప్రేమ్ సాగ‌ర్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. వీరి వ‌ల్ల నిర్మాణ రంగంలో డిస్‌ర‌ప్ష‌న్ జరిగి కొత్త‌గా రూపాంత‌రం చెందుతుంద‌న్నారు. ఇంకా, ఆయ‌న ఏమ‌న్నారంటే..

తెలంగాణ రాష్ట్రం స‌ర్వ‌తోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందుతుండ‌టం వ‌ల్ల రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు ఎక్క‌డ్లేని గిరాకీ పెరిగింది. ఈ స‌దావకాశాల్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎంతోమంది ఔత్సాహికులు రియల్‌ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. అవగాహన లేమి మరియు తగిన పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఈ నూతన ప్లేయర్లు తరచుగా యుడీఎస్‌/రెరా అనుమతి లేని ప్రాజెక్టుల్ని విక్రయిస్తున్నారు. ఇది రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌లో అతి పెద్ద అవ‌రోధంగా నిలిచింది. క్రెడాయ్‌ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ స్వీయ నిబంధ‌నావ‌ళిని పాటించాలి. నిర్మాణ నిబంధ‌న‌ల్ని క‌చ్చితంగా పాటించాలి. అందుకే, ఇందుకు సంబంధించిన ప్ర‌తి అంశాన్ని వివ‌రిస్తూ.. కొత్త డెవ‌ల‌ప‌ర్ల‌కు ఉప‌యోప‌డేందుకు వీలుగా స‌రికొత్త పుస్త‌కాన్ని అందుబాటులోకి తెస్తున్నాం. ప్రాజెక్టు నిర్మాణంలో అనుసరించాల్సిన మార్గాలు, ఎన్‌వోసీ పొందడం మొదలు నేపథ్యీకరణ, కొనుగోలుదారులకు తాము కొనుగోలు చేసిన ప్రాజెక్టులను అప్పగించడం వరకూ ప్రతి అంశాన్ని వెల్లడిస్తాం. ఇది రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఔత్సాహికుల‌కు మార్గదర్శిగా నిలుస్తుంది. నిబంధ‌న‌ల‌కు కట్టుబడి ఉండటంతో పాటుగా నాణ్యమైన ప్రాజెక్టులను అందించేందుకు, డిమాండ్‌ మరియు సరఫరా ఖాళీలను పూరించేందుకు తోడ్ప‌డుతుంది.

* క్రెడాయ్ తెలంగాణ నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో సంఘ స‌భ్యులైన జ‌గ‌న్ మోహ‌న్‌, అజ‌య్ కుమార్‌, పాండురంగారెడ్డి, మదుసూధ‌న్ రెడ్డి, సంకీర్త్ ఆదిత్యా రెడ్డి, అక్ష‌త్ ష‌ర‌ఫ్‌, సుభాష్ చౌద‌రి, సుధాక‌ర్ పైపుల ప్ర‌తినిధి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ధ‌ర‌ణీలో ప‌రిష్కారం
ధ‌ర‌ణిలో 34 ర‌కాల స‌మ‌స్య‌లు ఉండ‌గా.. అందులో 18 స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించింది. మిగ‌తావి మ‌రో నెల నుంచి నెలాప‌దిహేను రోజుల్లో ప‌రిష్కారం ల‌భిస్తుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles