-
- కిస్మత్‌పూర్‌లో రాజక్షేత్ర పూర్తి
- కొనుగోలుదారులకు హ్యాండోవర్ చేసిన గిరిధారి హోమ్స్
- ముచ్చటపడుతున్న బయ్యర్లు
- సబ్ లిమినల్ ఆర్కిటెక్చర్.. రాజక్షేత్ర వాసులకే పరిమితం
హైదరాబాద్‌లో అపార్టుమెంట్లను నిర్మించే సంస్థలు వందల్లో ఉంటాయి. కొన్ని కొనుగోలుదారులకు లగ్జరీ సదుపాయాలు, ఆధునిక సౌకర్యాల్ని అందజేస్తే, మరికొన్ని ల్యాండ్ స్కేపింగ్, ఎలివేషన్లకు ప్రాధాన్యతనిస్తాయి. కాకపోతే, నగరంలో ఒక థీమ్ ఆధారంగా ప్రాజెక్టుల్ని నిర్మించే అతికొద్ది నిర్మాణ సంస్థల్లో గిరిధారి హోమ్స్ ప్రముఖంగా నిలుస్తుంది. ఒక బడా ప్రాజెక్టులో లేని వైవిధ్యభరితమైన డిజైన్లు.. ఈ సంస్థ కట్టే అపార్టుమెంట్లలో దర్శనమిస్తాయి. ఇందుకు ప్రధాన కారణం.. సంస్థ ఎండీ ఇంధ్రసేనారెడ్డి. ఆయన ప్రపంచ నిర్మాణ రంగంలోని ఆధునిక పోకడల్ని ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుని.. వాటిని నగరవాసులకు అందించేందుకు త్రికరణశుద్ధితో ప్రయత్నిస్తారు. తమ కట్టడాలు ఇతరుల కంటే భిన్నంగా ఉండాలని నిత్యం తపన పడతారు. ప్రతి ప్రాజెక్టును వైవిధ్యభరితంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తారు. ఇందుకోసం రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా శ్రమిస్తారు. అవసరమైతే ప్రపంచాన్ని చుట్టేస్తుంటారు. అందుకే, ఒక కాన్సెప్టుతో కొత్త ప్రాజెక్టుని ప్రకటించగానే చాలు.. అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. తాజాగా, అప్పా జంక్షన్ చేరువలోని కిస్మత్ పూర్‌లో రాజక్షేత్ర ప్రాజెక్టును చూస్తే ఎవరైనా మురిసిపోవాల్సిందే. ఈ నిర్మాణం కోసం ఆయన ఎంచుకున్న కాన్సెప్టును చూసి అభినందించి తీరాల్సిందే.
సబ్‌లిమినల్ ఆర్కిటెక్చర్.. దీన్ని గురించి నగర బిల్డర్లలో ఎంతమందికి తెలుసో చెప్పలేం కానీ.. గిరిధారి హోమ్స్ మాత్రం ఈ కాన్సెప్టు ఆధారంగా రాజక్షేత్ర ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ఆర్కిటెక్చర్ ప్రత్యేకత ఏమిటంటే.. మనకు తెలియకుండానే మనకు ప్రేరణ కలిగే విధంగా ఉంటుంది. అది సబ్ కాన్షియస్ మైండ్‌లో శాశ్వతంగా నిలిచిపోతుంది. లోపల దాగి ఉన్న విషయం ఎప్పుడు బయటికి రావాలో అప్పుడే బయటికొస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని.. రాజక్షేత్ర ప్రాజెక్టులో కింగ్ కాన్సెప్టును ఎంచుకున్నారు. దీని ప్రకారం.. అపార్టుమెంట్‌లోని ఎంట్రెన్స్ నుంచి వివిధ ప్రాంతాల్లో రాజులకు సంబంధించిన డిజైన్లు, వస్తువుల్ని ఏర్పాటు చేశారు. వీటిని తదేకంగా చూడటం వల్ల.. ప్రతి మనిషిలో అంతర్గతంగా దాగి ఉన్న కింగ్ వంటి మనస్తత్వం బయటికొచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా వారికి తెలియకుండానే.. ఒక మహారాజాలా వైవిధ్యంగా, సృజనాత్మకంగా, సాహసంగా ఆలోచిస్తారు. ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రేరణ కలుగుతుంది. వీలైతే సాటివారికి సాయం చేసేవారుగా ఎదుగుతారు.
మనం గమనిస్తే పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా సబ్ లిమినల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించిన గృహాలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్తులో చిన్నారులకు మార్గదర్శకంగా ఉండాలనే ఆలోచనలతో.. గిరిధారి హోమ్స్ కిస్మత్‌పూర్‌లో రాజక్షేత్ర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని పూర్తి చేసి.. ఇటీవల కొనుగోలుదారులకు అందజేసింది. ఈ సందర్భంగా ఫ్లాట్లు కొన్నవారంతా మురిసిపోయారు. తమ కలల గృహాన్ని చూసి ఎంతో సంతోషించారు. రాజులకు సంబంధించిన ఎలిమెంట్స్ వాడటం వల్ల అందులో నివసించేవారు విశాలమైన దృక్పథంతో ఆలోచించేందుకు ఆస్కారం ఉంటుంది.
మన దేశంలో ప్రజలకోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా పోరాడినవారు చాలామంది ఉన్నారు. వారంతా మెరుగైన సమాజం కోసం బ్రతికారు. ఝూన్సీ రాణీలక్ష్మీబాయి, శివాజీ, అల్లూరి సీతారామరాజు, రాణా ప్రతాప్ వంటి వారు ప్రజల క్షేమాన్ని కాంక్షించారు. వారంతా దేశం కోసం, సమాజ అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. అనేక కష్టనష్టాలు ఎదుర్కొని, వాటిని సమర్థంగా అధిగమించారు. అందుకే, వారిని చూస్తే సరికొత్త ప్రేరణ కలుగుతుంది. మనలో చాలామంది రాజుల గురించి చదవడం మర్చిపోయారు. వారిలా జీవించడం ఎలాగో తెలుసుకోవడం లేదు. అందుకే, చిన్న చిన్న విషయాల్ని పరిష్కరించడంలో విఫలమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టెంత్ క్లాస్ ఫెయిల్ అయితే సూసైడ్ ఏమిటి? లవ్ ఫెయిల్ అయితే బలవ్మనరణం చేసుకుంటారా? అందుకే, ఈ ప్రాజెక్టులో నివసించేవారు.. ఎలాంటి గడ్డు పరిస్థితుల్ని అయినా గట్టిగా ఎదుర్కోవాలన్న ఉద్దేశ్యంతో.. గిరిధారి హోమ్స్ సబ్‌లిమినల్ ఆర్కిటెక్చర్‌ను రాజక్షేత్రలో ప్రవేశపెట్టింది. రాజుల థీమ్‌ను ఎంచుకున్నది. ప్రాజెక్టుల అవరణలో పలువురు రాజుల చిత్రపటాల్ని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు ఎంట్రెన్స్‌లో ప్రత్యేకంగా గుర్రం ఎక్కుతున్న రాజు విగ్రహాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించి పెట్టారు. ఇట్టి ఆవరణను ప్యారిస్‌లోని వర్సాసే నుంచి స్ఫూర్తి పొంది తీర్చిదిద్దింది. రాజులకు సంబంధించిన బొమ్మలు, చిత్ర పటాలుంటే వారి గురించి చదవాలని అనిపిస్తుంది. అందుకే, లైబ్రరీలో అలాంటి పుస్తకాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్యాలెస్ లుక్ ఉన్న ఇల్లు ఉండటంతో అందులో ఫ్లాట్లు కొన్నవారు గర్వంగా నివసించొచ్చు. నిలబడి తలతిప్పి చూసే ఎలివేషన్ కావడంతో నిలబడి సెల్ఫీ తీసుకోవాలని చాలామందికి అనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు ఆ చుట్టుపక్కల ఏరియాకు సరికొత్త అందాన్ని తెచ్చింది. ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుగా నిలుస్తుంది.
* ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక రాజులు ఎలా ఉండాలో తెలుసా? ఒక బిలియనీర్‌గా ఎప్పుడు ఎదుగుతారో తెలుసా? బిలియన్ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపెడితేనే సాధ్యం అవుతుంది. కోట్ల మందిని ప్రభావితం చేస్తేనే విజయం సాధిస్తారు. ఉదాహరణకు ఐఫోన్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ వంటివి ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేశాయి. అందుకే అవి విజయవంతం అయ్యాయి. ఇలా అధిక శాతం మంది గురించి ఆలోచించి సరైన పరిష్కారం చూపిస్తేనే నెక్ట్స్ లెవెల్ వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది.
గిరిధారి అవిఘ్నలో మా బావ ఫ్లాట్ చూసేందుకు వెళ్లినప్పుడు రాజక్షేత్ర బ్రోచర్ చూశాను మంచి కాన్సెప్టు అనిపించింది. ఫ్లాట్ల కంటే వ్యక్తిగత గృహంలో నివసించాలన్న నా ఆలోచనను పక్కన పెట్టేసి అందులో ఫ్లాట్ కొన్నాను. బ్రోచర్లో చూపించినట్లుగానే 95 శాతం దాకా చేసి చూపెట్టారు. ఇందులో నివసిస్తున్నందుకు గర్వంగా ఉంది. మా సోదరుడికీ ఫ్లాట్ ఇప్పించాను. ఇంద్రసేనారెడ్డికి మంచి విజన్ ఉంది. ఆయన సిబ్బంది కూడా స్నేహపూర్వకంగా ఉంటారు. భవిష్యత్తులో ఈ సంస్థ ఎక్కడ ప్రాజెక్టును ఆరంభించినా కొనాలని నిర్ణయించుకున్నాం.
– చంద్రశేఖర్- ఓనర్, గిరిధారి రాజ్యక్షేత్ర
గిరిధారి రాజ్యక్షేత్రలో ఫ్లాట్ కొని.. ఇందులో నివాసం ఏర్పాటు చేసుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఎలివేషన్ చూస్తే ముచ్చటేస్తోంది. సెంట్రల్ కోర్టు, ఆధునిక సదుపాయాలు అదుర్స్. రాయల్ ఆర్కిటెక్చర్‌తో కూడుకున్న ఈ అందమైన కాన్సెప్టుతో ప్రాజెక్టును ఆరంభించినందుకు సంస్థ ఎండీ ఇంద్రసేనారెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఇక్కడి కమ్యూనిటీ కూడా చాలా చక్కగా ఉంది. రాజక్షేత్రలో నివసిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.
– రోహిత్- ఓనర్, గిరిధారి రాజక్షేత్ర
హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందామన్నది మా ఆలోచన. అందుకే, నగరంలో అనేక ప్రాజెక్టుల్ని స్వయంగా వెళ్లి చూశాం. నా భార్య గిరిధారి హోమ్స్ సంస్థ వెబ్‌సైట్ చూసింది. రాజక్షేత్ర ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్కిటెక్చర్ చూడగానే తెగ నచ్చేసింది. ఒకసారి సైటుకెళ్లి చూసి వద్దామని అనుకున్నాం. ఆరంభంలోనే ఫ్లాట్ కొన్నాం. ఇప్పుడు ఫ్లాట్ ని చూస్తే ఆనందమేస్తుంది. అనుకున్న దానికంటే మెరుగ్గా ప్రాజెక్టును నిర్మించారు.
– మనోజ్- ఓనర్, గిరిధారి రాజక్షేత్ర
మేం హైదరాబాద్‌లో దాదాపు పదిహేనేళ్ల నుంచి నివసిస్తున్నాం. ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన మాకు ఈ ప్రాజెక్టు ఎంతగానో నచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొన్నాం. మా ఈ ప్రప్రథమ కలల గృహాన్ని చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోంది. ఈ కమ్యూనిటీ కూడా మాకు ఎంతగానో నచ్చింది. ఇందులో ఫ్లాట్ కొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం.
– అనుపమ్-ఓనర్, గిరిధారి రాజక్షేత్ర
రాజ్యక్షేత్రలో 412 ఫ్లాట్ కొనుగోలు చేసినందుకు సంతోషంగా ఉంది. మా భర్త స్నేహితుడి ద్వారా ఈ ప్రాజెక్టు గురించి తెలిసింది. మా కలల గృహాన్ని చేతికి అందజేస్తుంటే గర్వంగా ఉంది. ఈ ప్రాజెక్టు మాకు నచ్చడంలో ఇందులో ఫ్లాటు కొనాలని చాలామంది స్నేహితులకు, కొలీగ్స్ కు రిఫర్ చేస్తున్నాను. గిరిధారి సంస్థ కట్టే ప్రాజెక్టులన్నీ విభిన్నంగా ఉంటాయి. థీమ్ ఆధారంగా డిజైన్ చేసి మంచి సదుపాయాల్ని పొందుపరుస్తుంది.
– జయంతీ కోన- ఓనర్, గిరిధారి రాజక్షేత్ర