poulomi avante poulomi avante

క్రెడాయ్ 25 ఇయర్స్ సక్సెస్ స్టోరీ

పాతికేళ్ల క్రితం కంటే ముందు.. నిర్మాణ రంగ‌మంటే.. బిల్డ‌ర్లు త‌మ‌కు న‌చ్చిన‌ట్లుగా.. క‌నిపించిన ప్రాంతంలో వ్య‌క్తిగ‌త గృహాలు, అపార్టుమెంట్ల‌ను నిర్మించేవారు. కానీ, వారంద‌రినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి.. క్రెడాయ్ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి.. అందులో బిల్డ‌ర్ల‌ను స‌భ్యులుగా చేర్చి.. వివిధ రాష్ట్రాల్లో సంఘాల్ని ఏర్పాటు చేసి.. ఈ రంగం ఎదుగుద‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే స‌ల‌హాలు, సూచ‌న‌ల్ని ఇస్తూ.. మ‌రోవైపు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సాంకేతిక స‌హాయాన్ని అంద‌జేస్తూ.. నిర్మాణ ప‌రిశ్ర‌మ ఎదుర్కొనే అనేక‌ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తూ.. ఎప్ప‌టిక‌ప్పుడు ఆధునిక పోక‌డ‌ల గురించి సంఘ స‌భ్యుల‌కు తెలియ‌జేస్తూ.. నిర్మాణ రంగం మ‌న దేశంలో దిన‌దిన ప్ర‌వ‌ర్థ‌మానంగా అభివృద్ధి చెంద‌డానికి క్రెడాయ్ ముఖ్య భూమిక‌ను పోషించింద‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. గ‌త పాతికేళ్ల‌లో భార‌త నిర్మాణ రంగం వృద్ధి చెందిందంటే.. అందులో కీల‌క పాత్ర క్రెడాయ్‌దే అని త‌ప్ప‌క చెప్పాల్సిందే

రియల్‌ ఎస్టేట్‌ అంటే కేవలం బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ మాత్రమే కాదు. రియాల్టీ రంగం అంటే దూరదృష్టి, అభివృద్ధి, సహాయ- సహకారాలు కూడా. అలాంటి నిర్మాణ రంగానికి దేశంలో దిక్సూచీగా వ్యవహరిస్తుంది క్రెడాయ్‌ నేషనల్‌. 1999లో ఏర్పడిన క్రెడాయ్‌ ఈ పాతికేళ్ల జర్నీలో ఇండియన్‌ రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో వచ్చిన అనేక మార్పులకు ప్రత్యక్షసాక్షి. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ దానికి తగ్గట్టు అంతర్జాతీయంగా నిర్మాణ రంగంలో వచ్చే మార్పులను పరిశీలిస్తూ.. ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్ వృద్ధి చెంద‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే సలహాలు సూచనల్ని ఇస్తూ.. ఈ రంగం మరింత వృద్ధి చెందడమే లక్ష్యంగా పని చేస్తుంది క్రెడాయ్‌. గడిచిన 25 ఏళ్లే కాదు.. రానున్న ట్వంటీ ఫైవ్‌ ఇయర్స్‌ కూడా ఛాలెంజింగ్‌గా తీసుకోని వర్క్‌ చేస్తామంటోంది క్రెడాయ్‌.

కాన్ఫెడరేషన్‌ ఆఫ్ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్ ఇండియా- క్రెడాయ్‌. భారతదేశంలోని ప్రైవేట్ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల‌కు అపెక్స్‌ బాడీగా వ్యవహరిస్తున్న క్రెడాయ్‌- బిల్డింగ్‌ ద నేషన్‌ అంటూ 1999లో ప్రారంభమైంది. గ‌త పాతికేళ్లుగా భారత నిర్మాణ రంగానికి తన వంతు సేవల్ని అందిస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ దానికి తగ్గట్టు అంతర్జాతీయంగా నిర్మాణ రంగంలో వచ్చే మార్పులను పరిశీలిస్తూ ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌కు కావాల్సిన సలహాలు సూచనలిస్తూ ఈ రంగం మరింత వృద్ధి చెందడమే లక్ష్యంగా పని చేస్తుంది క్రెడాయ్‌.

తాము సాధించిన ఎచీవ్‌మెంట్స్‌.. అలాగే ఫ్యూచర్ ప్లానింగ్‌.. నిర్మాణ రంగంలో వస్తోన్న మార్పులపై అభిప్రాయాలను వెల్లడించడానికి న్యాట్‌కాన్‌ పేరుతో ప్రతి ఏటా వార్షిక మహోత్సవాన్ని నిర్వహిస్తుంటుంది. ఇప్పటివరకు దుబాయ్‌, లండన్‌, ఈజిప్ట్, సిడ్నీ నగరాల్లో న్యాట్‌కాన్‌ ఎడిషన్స్‌ను కండక్ట్‌ చేసింది క్రెడాయ్‌.

ప్ర‌తిఏటా జ‌రిగే ఈ ఈవెంట్‌లో.. డెవలపర్స్‌, ఆర్కిటెక్ట్స్‌, ప్రభుత్వాధికారులు, ఫైనాన్స్‌- బ్యాంకింగ్ సెక్టార్‌కు చెందిన లీడర్స్‌, ఇన్వెస్టర్లు, టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్‌ సహా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు, దిగ్గజాలతో కీలక ప్రసంగాలు, ప్యానెల్ డిస్కషన్స్‌, ఇన్నోవేటివ్ వర్క్‌షాప్స్‌ ఎగ్జిబిషన్‌ ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇండియన్ రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్‌ చేసే బాధ్యతను క్రెడాయ్ తీసుకుంది. ఇంటర్నేషనల్‌ లెవల్లో నిర్వహిస్తోన్న ఈవెంట్స్‌తో మార్కెటింగ్‌, ప్రమోషన్‌ యాక్టివిటీకి ఉపయోగించుకొంటూ నిర్మాణ రంగంలో విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి క్రెడాయ్‌ కృషి చేస్తుంది. అలాగే రెరా ఇంప్లిమెంటేషన్‌.. హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌, క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ స్కీమ్‌ లాంటి ప్రభావవంతమైన పాలసీల అమల్లోనూ ప్రభుత్వాలకు సాయం చేస్తోంది క్రెడాయ్‌. గత 25 ఏళ్లుగా ఓ వైపు సీఎస్సార్‌ యాక్టివిటీతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విరాళాల్ని అందిస్తూ సామాజిక బాధ్యతలోనూ తన వంతు పాత్ర పోషిస్తుంది.
రియల్‌ ఎస్టేట్- ఇన్ఫ్రాస్ట్రక్చర్‌- ఒకదాని అభివృద్ధి మరో రంగంపై ఆధారపడి ఉన్నాయ్‌. అందుకే క్రెడాయ్‌ కేవలం రియల్‌ ఎస్టేట్‌ రంగానికే పరిమితం కాకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులకు సంబంధించి కావాల్సిన సహాయ సహకారాలు.. సమాచారం సైతం అందిస్తుంటుంది. ఎలాంటి పద్ధతులు అనుసరిస్తే మౌలిక రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతుందో.. నిర్మాణంలో అనుసరించాల్సిన ఆధునిక పద్ధతుల గురించి ప్రభుత్వాలకు నివేదికల్ని ఎప్ప‌టిక‌ప్పుడు క్రెడాయ్ అందిస్తుంది.
రియల్ ఎస్టేట్‌ రంగంలో జెండర్ న్యూట్రల్‌గా చేయడమే తమ లక్ష్యమంటోన్న క్రెడాయ్‌- ఇటు యూత్‌ వింగ్‌తో పాటు ఉమెన్ వింగ్‌ను కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచ నిర్మాణ పరిశ్రమలో తాజా పోకడలు, ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచే కార్యక్రమాల్ని చేపడుతోన్న క్రెడాయ్‌.. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న నిర్మాణ రంగాన్ని వచ్చే 20 ఏళ్లలో కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌ను నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పెట్టుకొంది.

 

బిల్డ‌ర్ల‌కు మార్గ‌ద‌ర్శి.. క్రెడాయ్

రియల్ ఎస్టేట్‌ రంగం భవిష్యత్‌ ఎలా ఉండనుంది..? ఫ్యూచర్‌లో ఎలాంటి మార్పులు జరగనున్నాయ్‌..? ఎలాంటి క్రియేటివ్ మార్పులు సంభవించనున్నాయ్‌..? కస్టమర్లకు ఎలాంటి సేవ‌ల్ని అందించాలి? వంటి అంశాల్లో ఎప్ప‌టికప్పుడు క్రెడాయ్ త‌మ స‌భ్యుల్ని ఎప్ప‌టిక‌ప్పుడు మార్గ‌ద‌ర్శ‌కం చేస్తుంది.

యువ బిల్డ‌ర్ల‌కు దిక్సూచీ

వెతికి చూడాలే కానీ కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌లో ఎన్నో అవకాశాలు. ఇప్పటికే దిగ్గజాలుగా ఎదిగిన కంపెనీలకు తోడు ఫ్యూచర్‌లో ఈ రంగంలోకి రావాలని ఆశపడే యంగ్ జనరేషన్‌ను రైట్‌ డైరెక్షన్‌లో నడిపించడానికి తన వంతు కృషి చేస్తుంది క్రెడాయ్‌. అంతేకాదు కస్టమర్లకు ఉండే అపోహలు తొలగిస్తూ.. ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరిస్తూ రియల్ ఎస్టేట్‌ రంగంపై నమ్మకం – భరోసాని కల్పించే బాధ్యతలు కూడా తీసుకుంది. ఇండియాలోని దాదాపు 21 రాష్ట్రాల్లోని 230కి పైగా నగరాలకు చెందిన 13 వేల 300 మంది డెవలపర్స్‌ క్రెడాయ్‌ నేషనల్‌లో సభ్యులుగా ఉన్నారు. క్రెడాయ్ నేషనల్ సెక్రటేరియట్‌ ఢిల్లీలో ఉంది.

విక‌సిత్ భార‌త్ దిశ‌గా..

భార‌త‌దేశంలో నిర్మాణ రంగం వృద్ధి చెంద‌డానికి క్రెడాయ్ కీల‌క పాత్ర పోషించింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. బిల్డ‌ర్లంద‌రికీ ఎప్ప‌టిక‌ప్పుడు మార్గ‌నిర్దేశం చేస్తూ.. ప్ర‌పంచ నిర్మాణ పోక‌డ‌ల్ని వారికి తెలియ‌జేయ‌డంలో ముందు ఉంటుంది. క్రెడాయ్‌లో వివిధ స్థాయిలో ప‌ని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. గడిచిన 25 ఏళ్లే కాదు.. రానున్న ట్వంటీ ఫైవ్‌ ఇయర్స్‌ కూడా ఛాలెంజింగ్‌గా తీసుకుని ప‌ని చేస్తాం.

ఇండియన్ రియాల్టీ సెక్టార్ రోడ్ మ్యాప్‌తో పాటు వన్ ట్రిలియన్‌ దిశగా పరుగులు పెడుతున్న మార్కెట్ పరిమాణం, వికసిత్‌ భారత్‌లో భాగంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు- వాటికి ఎదురవుతున్న సమస్యలు, భారతీయ ఆర్థిక వ్యవస్థ- ఉపాధి కల్పనలో రియల్ ఎస్టేట్ రంగం పాత్ర, రియాల్టీ సెక్టార్‌లో స్టార్టప్‌ స్టోరీస్‌, ఏఐ, వీఆర్‌ లాంటి టెక్నాలజీతో నిర్మాణ రంగంలో రానున్న మార్పులు- విప్లవాలు వంటి కొత్త సాంకేతికలపై దృష్టి పెట్టి రానున్న 20 ఏళ్లలో దేశంలో నిర్మాణ రంగాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో మా క్రెడాయ్ ఉంది. – గుమ్మి రాంరెడ్డి, సెక్ర‌ట‌రీ, క్రెడాయ్ నేష‌న‌ల్

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles