తెలంగాణలోని క్రెడాయ్ నిర్మాణ సంఘాల సమాహారమైన క్రెడాయ్ తెలంగాణ సరికొత్త రికార్డును సృష్టించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో సొంతంగా ఆఫీసు స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ కార్యాలయాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం ప్రారంభిస్తారు. ఆయనతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
క్రెడాయ్ తెలంగాణ సంఘానికి కొత్త కార్యాలయం వల్ల కలిగే లాభమేమిటంటే.. ఈ సంఘానికంటూ సొంతంగా ఒక స్థలమంటూ ఉండటంతో పాటు, అందులో సంఘానికి చెందిన సభ్యులను సులువుగా కలుసుకునేందుకు వీలు కలుగుతుంది. క్రెడాయ్ తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన నిర్మాణ సంఘ సభ్యులు కలిసి సమావేశాల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో నెలకొన్న కొత్త పోకడలపై ఇక్కడే చర్చించుకోవచ్చు. ఈ రంగంలోకి విచ్చేసిన కొత్త బిల్డర్లు సీనియర్ డెవలపర్ల నుంచి కొత్త విషయాల్ని నేర్చుకోవచ్చు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు వంటివి ఇందులో చర్చించే వీలుంటుంది. మొత్తానికి, ఎలా చూసినా క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు మురళీకృష్ణా రెడ్డి అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారని చెప్పొచ్చు. ఈ సంఘానికి అధ్యక్షుడైన తొలి రోజుల్లోనే రియల్ ఎస్టేట్ గురుతో ఆయన మాట్లాడుతూ.. క్రెడాయ్ తెలంగాణ సంఘానికి ఎలాగైనా ఓ సొంత భవనాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నానని తెలిపారు. ఆయన అనుకున్నట్లే.. సంఘసభ్యుల సహాయ సహకారాలతో కొత్త కార్యాలయం ఏర్పాటైందని ఆయన రియల్ ఎస్టేట్ గురుకి తెలిపారు.
This website uses cookies.