Categories: Celebrity Homes

పది కోట్లతో భూమి కొన్న క్రికెటర్ కేఎల్ రాహుల్

  • సునీల్ శెట్టితో కలిసి ముంబైలో ఏడెకరాలు కొనుగోలు

టీమిండియా క్రికెట్ కేఎల్ రాహుల్ దాదాపు రూ.10 కోట్లు వెచ్చించి భూమి కొనుగోలు చేశారు. నటుడు, ఆయన మామయ్య సునీల్ శెట్టితో కలిసి ముంబై థానేలోని ఓవాలే ప్రాంతంలో ఎడెకరాల భూమిని రూ.9.85 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. మొత్తం 30 ఎకరాల 17 గుంతల విస్తీర్ణంలో పెద్ద పార్శిల్లో ఏడెకరాల అవిభక్త భూమిని వీరిద్దరూ కలిసి కొన్నట్టు రిజిస్ట్రేషన్ పత్రాలు వెల్లడించాయి. మార్చి 20న జరిగిన ఈ రిజిస్ట్రేషన్ కు రూ.68.96 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. థానేను ముంబైకి అనుసంధానించే కీలక మార్గాలలో ఒకటైన ఘోడ్‌బందర్ రోడ్ వెంబడి థానే వెస్ట్ లో ఓవాలే ఉంది. కాగా, గతేడాది జూలైలో కెఎల్ రాహుల్, ఆయన భార్య అతియా సునీల్ శెట్టి, ముంబైలోని బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో రూ.20 కోట్లు వెచ్చించి అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు.

బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలోని గ్రౌండ్-ప్లస్-18 అంతస్తుల సంధు ప్యాలెస్ భవనం యొక్క రెండవ అంతస్తులో 3,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ ప్రాపర్టీ ఉంది. అలాగే గతేడాది అక్టోబర్ లో సునీల్ శెట్టి, ఆయన కుమారుడు అహన్ శెట్టి ముంబైలో 1,200 చదరపు అడుగుల ప్రాపర్టీని బ్యాంక్ వేలంలో రూ.8.01 కోట్లకు కొనుగోలు చేశారు. ముంబైలోని ఖార్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాపర్టీని తండ్రీకొడుకులు బ్యాంకు వేలంలో కొన్నారు.

This website uses cookies.