Categories: TOP STORIES

పెంట్ హౌస్.. రూ.75 కోట్లు

అమెరికాలో రియల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్ లో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి. న్యూయార్క్ వెస్ట్ విలేజ్ లో పెంట్ హౌస్ ఏకంగా రూ.75 కోట్ల (8.75 మిలియన్ డాలర్లు) ధర నిర్ధారించడమే ఇందుకు నిదర్శనం. మన్ హాట్టన్ స్ట్రీట్ లోని ఓ ప్రాజెక్టులో పెంట్ హౌస్ కి ఈ రికార్డు స్థాయి ధర ఖరారు చేశారు. వెస్ట్ విలేజ్‌లోని 140 జేన్ స్ట్రీట్‌లోని డ్యూప్లెక్స్ కాండో.. ఫ్లోర్ టూ సీలింగ్ విండోతో హడ్సన్ నది వీక్షణలను అద్భుతంగా అందిస్తుంది. ఇందులో పూల్ కలిగిన టెర్రస్, మూడు బాల్కనీలతో కూడిన అపార్ట్ మెంట్ 9,532 చదరపు అడుగుల (886 చదరపు మీటర్లు) ఇండోర్ స్థలంతో ఉంది. అరోరా క్యాపిటల్ అసోసియేట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

ఇందులోని ధరలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న రేట్లతో పోలిస్తే ఏకంగా 46 శాతం ఎక్కువ. ఇప్పటికే ఈ భవనంలోని ఇతర యూనిట్లలో చాలావరకు అమ్ముడైపోయాయని స్థానిక ఏజెంట్లు వెల్లడించారు. ఇక ఈ ప్రాజెక్టులో మొత్తం 14 యూనిట్లు ఉండగా.. తొమ్మిది యూనిట్ల అమ్మకం పూర్తయింది. వీటిలో మూడు అపార్ట్ మెంట్లు రూ.342 కోట్ల (40 మిలియన్ డాలర్లు)కు పైనే ధర పలికాయి. ఇక 5,700 చదరపు అడుగుల మరో పెంట్‌హౌస్ ధరను రూ.385 కోట్లు (45 మిలియన్ డాలర్లు)గా ఖరారు చేశారు. అంటే చదరపు అడుగుకు 7,960 డాలర్ల ధర అన్నమాట. కాగా, ఇప్పటివరకు, వెస్ట్ విలేజ్‌లో అత్యంత ఖరీదైన లావాదేవీ 150 చార్లెస్ స్ట్రీట్‌లో 5,840 చదరపు అడుగుల డ్యూప్లెక్స్ దే. దీనిని 60 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అంటే దాదాపు రూ.513 కోట్లు.

This website uses cookies.