poulomi avante poulomi avante

దుబాయ్ లో అద్దె ఫ్లాట్లకు డిమాండ్ పెరగాలంటే..?

దుబాయ్ లో అపార్ట్ మెంట్ కొంటున్నారా? అయితే, మండుతున్న వేసవిలో అది ఖాళీగా ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అద్దెదారులు ఏ ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడుతున్నారు? ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటున్నారో తెలుసుకోవాల్సిందే. ఇందుకోసం కోలైఫ్ సంస్థ కొన్ని సూచనలు చేస్తోంది. దుబాయ్ లో ఏ అపార్ట్ మెంట్లు అత్యధిక డిమాండ్ కలిగి ఉన్నాయో ఈ సంస్థ అధ్యయనం చేసింది. అవేంటో చూద్దామా?

ఏ అపార్ట్ మెంట్ కి అయినా అది ఉన్న ప్రదేశం చాలా కీలకం. దుబాయ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రాంతాలు దుబాయ్ మెరీనా, బిజినెస్ బే, డౌన్ టౌన్ దుబాయ్, జుమేరా లేక్ టవర్స్. వేసవిలో రవాణా అత్యంత ముఖ్యం. మెట్రో, బస్సు, ట్రామ్ కి 5 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టకూడదు. కొందరు అద్దెదారులు నిర్మాణ స్థలాలకు దూరంగా దుబాయ్ లోని నిశ్శబ్ద ప్రదేశాలలో అపార్ట్ మెంట్లను కూడా కోరుకుంటారు. అయితే, ఇవి చాలా తక్కువే ఉంటాయి. ఒకవేళ మీకు అలాంటి అపార్ట్ మెంట్ ఉంటే.. సంపన్న అద్దెదారులను ఆకర్షించే అవకాశం ఉంది. అలాగే స్విమింగ్ పూల్స్, జిమ్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయో లేదో అద్దెదారులు చూసుకుంటారు. అందువల్ల మీ అపార్ట్ మెంట్లో ఇవి ఉండాల్సిందే.

దుబాయ్ వంటి పర్యాటక ప్రదేశంలో ఎవరైనా సరే పూర్తి ఫర్నిష్డ్ అపార్ట్ మెంట్లనే కోరుకుంటారు. ‘కోలైఫ్ అద్దెదారులు అపార్ట్ మెంట్ల నిర్వహణ, ఇతరత్రా అంశాల విషయంలో మా అంకితభావాన్ని అభినందిస్తారు. మేం ఎల్లప్పుడూ బెడ్ రూమ్, పని ప్రదేశం, స్టోరేజ్ స్పేసెస్ అనే మూడు ఫంక్షనల్ జోన్లు నిర్వహిస్తాం. అంతేకాకుండా రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, స్టవ్, కిచెన్ వేర్, డైనింగ్ ఉపకరణాలు, బెడ్డింగ్, పోస్టర్స్, టెక్స్ టైల్స్, కేండిల్స్ వంటి డెకరేషన్స్ కూడా అందజేస్తాం. కాఫీ మెషీన్, టీవీ; వైర్ లెస్ స్పీకర్ కూడా ఇప్పుడు జోడించాం’ అని కోలైఫ్ దుబాయ్ డిజైనర్ క్రిస్టినా జగ్రేబెల్నాయ పేర్కొన్నారు.

దుబాయ్ అనేది ప్రవాసుల నగరం. ఇక్కడకు వచ్చేవారు క్రమం తప్పకుండా ఉపయోగించని వస్తువులను కూడా తెచ్చుకుంటారు. వాటిని భద్రంగా ఉంచడానికి స్టోరేజ్ స్పేస్ కావాలి. కోలైఫ్.. రోజువారీ ఉపయోగం కోసం సౌకర్యవంతమైన చిన్న అపార్ట్ మెంట్టు నిర్వహిస్తుంది. అందువల్ల పెద్ద పెద్ద వస్తువులను ఉంచడానికి సరిపడా స్థలం ఉండదు. ఈ నేపథ్యంలో స్టోరేజ్ స్పేస్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం ద్వారా ఈ సమస్యను కోలైఫ్ పరిష్కరించింది. ఆయా కంపెనీలు కోలైఫ్ అద్దెదారుల వస్తువులను తగ్గింపు ధరకే భద్రపరుస్తాయి. ఇక దుబాయ్ లోని అపార్ట్ మెంట్లకు సమర్థవంతమైన ఏసీ చాలా అవసరం. అది లేకుంటే మీ అపార్ట్ మెంట్ ని అద్దెదారులు ఖాళీ చేయడం ఖాయం.

సంవత్సరంలో ఏ సమయంలోనైనా అపార్ట్ మెంట్లో బొద్దింకలు, చీమలు వంటి చీడపీడ పురుగులు ఉండకుండా చూసుకోవాలి. ఇంకా అపార్ట్ మెంట్లోని ఖాళీ స్థలాలను చక్కగా పూరించాలి. రగ్గులు, దిండ్లు, పోస్టర్లు, మొక్కలు, కుండీల వంటివి చిన్నచిన్నవే అయినా.. వాటి అప్పీల్ చాలా కీలకంగా ఉంటుంది క్రిస్టినా చెబుతున్నారు. అద్దెదారులు సౌకర్యవంతమైన బెడ్, కన్వర్టబుల్ సోఫా, పని, భోజనాల కోసం కుర్చీలతో కూడిన టేబుల్, స్థలాన్ని ఆదా చేసే వార్డ్ రోబ్ లు, పూర్తి నిడివి కలిగిన పెద్ద అద్దం వంటివి కోరుకుంటారు. భారీ కర్టెన్లు, భారీ టీవీ స్టాండ్ల వంటి వాటికి దూరంగా ఉండటమే బెటర్. మీ అపార్ట్ మెంట్ ఈ అవసరాలకు చాలావరకు అనుగుణంగా ఉంటే దానికి కనీసం 15 శాతం ఎక్కువ అద్దెకు తీసుకోవచ్చని తమ డేటా ప్రకారం తేలిందని కోలైఫ్ సేల్స్ హెడ్ వ్యాచెస్లావ్ కుజ్నెత్సోవ్ తెలిపారు. మొత్తమ్మీద లొకేషన్, బిల్డింగ్ సౌకర్యాలు, ఇంటీరియర్ డిజైన్ తోపాటు అద్దెదారు ప్రాధాన్యతలను అర్థం చేసుకుని పరిష్కరించే అపార్ట్ మెంట్లకే డిమాండ్ అధికంగా ఉంటుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles