Categories: LATEST UPDATES

ఖాజాగూడ కొండను పరిరక్షించాలంటూ ధర్నా

  • స్పందించిన మంత్రి కేటీఆర్.. వీఆర్ఏ సస్పెన్షన్
ఆక్రమణదారుల కబ్జా కారణంగా హైదరాబాద్ ఖాజాగూడలోని పురాతన కొండ క్రమంగా అదృశ్యమవుతోందని, ఈ ఆక్రమణలను అధికార యంత్రాంగం ఎందుకు అడ్డుకోలేకపోతోందంటూ పలువురు ధర్నా చేశారు. అలాగే ఈ వ్యవహారాన్ని మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. దీంతో ఆయన వెంటనే స్పందించారు. ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ని ఆదేశించించారు. కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అరవింద్ కుమార్.. చర్యలు చేపట్టారు. నలుగురు ఆక్రమణదారులపై కేసు నమోదు చేయించడంతోపాటు సంబంధిత వీఆర్ఏను సస్పెండ్ చేశారు. అలాగే ఆ ప్రాంతాన్ని 24 గంటలపాటు పరిరక్షించేందుకు వీలుగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు నివేదించారు.

This website uses cookies.