Categories: TOP STORIES

ప్రీ లాంచ్‌లో కొన‌వ‌ద్దు

  • రియ‌ల్ ఎస్టేట్ గురు ఎఫెక్ట్‌
  • పుర‌పాల‌క శాఖ తాజా ఆదేశం

జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా.. రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండా చేపట్టిన ప్రాజెక్టుల్లో జరుగుతున్న అక్ర‌మ అమ్మకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రీ లాంచ్‌లో కొనేట‌ప్పుడు అన్ని అనుమతులూ ఉన్నాయో లేవో సరి చూసుకోవాలని సూచించింది. కొందరు బిల్డర్లు తమ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులూ లేకపోయినా.. కొనుగోలుదారులను ఆకర్షించి ఫ్లాట్లను విక్రయించేందుకు సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్న విషయాన్ని రియల్ ఎస్టేట్ గురు వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన పుర‌పాల‌క శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. రెరా చట్టం ప్రకారం బిల్డర్లు తమ ప్రాజెక్టుకు సంబంధిత అథార్టీ నుంచి తొలుత అనుమతులు పొందాలి. రెరాలో రిజిస్టర్ చేసుకున్న తర్వాతే వాటి అమ్మకాలు జరపాలి. రెరాలో రిజిస్టర్ కాని ప్రాజెక్టుల్లో కొనుగోలు చేసినవారి డబ్బుకు ఎలాంటి భద్రతా ఉండదు. అందువల్ల ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పుర‌పాల‌క శాఖ సూచించింది.

This website uses cookies.