అమెరికాలో ఆర్థిక మాంద్యం డిసెంబర్ 2023 వరకు కొనసాగుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. అయితే, అమెరికాలో నివసించే లక్షల మంది భారతీయుల్లో.. ముఖ్యంగా తెలుగు వారిలో ఐటీ, వైద్య రంగంలోనే ఉన్నారు. ఈ రెండు రంగాలు మెరుగ్గానే ఉండటం వల్ల ఆర్థిక మాంద్యం ప్రభావం తెలుగు వారి మీద పడదని నిపుణులు అంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం కనిపిస్తున్న మాట వాస్తవమే. ద్రవ్యోల్బణం కూడా పెరుగుతోంది.
కాకపోతే, అక్కడి ప్రభుత్వం ఖర్చులను తగ్గించడం మీదే ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో ధరల్ని పెంచుతుంది. ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థకు మేలు కలిగిస్తాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికా బలవంతపు చర్యల్ని కూడా తీసుకుంటుంది. 2007లో ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు.. అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలలేదనే విషయం అర్థం చేసుకోవాలి. ఆతర్వాత, మళ్లీ ఆర్థిక రంగాలు గాడిలో పడ్డాయన్న సంగతి మర్చిపోవద్దు. కాబట్టి, ప్రస్తుతం ఆర్థిక మాంద్యం తలెత్తినా, అమెరికాలోని తెలుగు ప్రజలపై ఎలాంటి ప్రతికూలత ఏర్పడదు. వారంతా సురక్షితంగానే ఉంటారని తానా, నాటా వంటి సంఘాల ప్రతినిధులు సైతం చెబుతున్నారు.