poulomi avante poulomi avante

ఉద్యోగులు ప్రీలాంచ్‌లో అమ్మితే ఊచ‌లు లెక్కించాల్సిందే!

employees will go jail if they sell flats in prelaunch scheme, Sahiti group is a live example. Their Sales and CRM Executive names included in the police FIR, who sold flats in prelaunch.

  • ఎగ‌బ‌డి ప్రీలాంచుల్లో అమ్మ‌కూడ‌దు
  • నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే అంతే ఇక‌!
  • ఉద్యోగంలో భాగమ‌ని భావించొద్దు
  • పోలీసు ఎఫ్ఐఆర్‌లో సాహితీ ఉద్యోగులు

మీరు ఏదైనా రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తున్నారా? మీ కంపెనీ ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ ప్రీలాంచ్‌లో విక్ర‌యిస్తోందా? టార్గెట్ల‌ను చేరుకోవ‌డం కోస‌మో.. క‌మిష‌న్ వ‌స్తుంద‌ని ఆశ‌ప‌డో.. మీరూ వాటిని విక్ర‌యిస్తున్నారా? మీరెంతో క‌ష్ట‌ప‌డి క‌స్ట‌మ‌ర్ల‌ను ఒప్పిస్తున్నారా? అయితే.. ఒక్క నిమిషం ఆగండి. పొర‌పాటున మీ కంపెనీ గ‌న‌క ప్రాజెక్టును ప్రారంభించ‌క‌పోయినా.. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రాక ఆ నిర్మాణం నిలిచిపోయినా.. ఆయా సంస్థ‌తో పాటు మీరు కూడా పోలీసు స్టేష‌న్ల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తుంద‌ని గుర్తుంచుకోండి. సాహితీ సంస్థ ప్రాజెక్టులో ఫ్లాట్ల‌ను విక్ర‌యించిన క‌స్ట‌మ‌ర్ రిలేష‌న్ మేనేజ‌ర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు ఇలాగే పోలీసు ఎఫ్ఐఆర్‌లో చేరారు. సాహితీ సంస్థ ఎండీ, డైరెక్ట‌ర్ల‌తో పాటు వీరి మీద ఎఫ్ఐఆర్ న‌మోదైన విష‌యం మ‌ర్చిపోవ‌ద్దు.

ప్రీలాంచ్ ఆఫర్ల పేరిట జరిగే స్కాముల్లో ఆయా సంస్థ‌లో ప‌ని చేసే ఉద్యోగులూ నిందితులు అవుతార‌నే విష‌యం సాహితీ ప్రీలాంచ్ స్కామ్ ఉదంతం ద్వారా తెలిసింది. తమకు తెలిసి చేసినా.. తెలియకుండా చేసినా.. ఇలాంటి స్కాముల్లో ప్రమేయం ఉన్న ఉద్యోగులూ జైలు పాలు కాక తప్పదు. తాజాగా వెలుగులోకి వచ్చిన సాహితీ ఇన్ ఫ్రా కుంభకోణం ఇదే అంశాన్ని తెలియజేస్తోంది. ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో వేలాది మందిని దాదాపు రూ.900 కోట్ల మేర నిలువునా ముంచేసిన సాహితీ ఇన్ ఫ్రాటెక్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఎలాంటి అనుమతులు తీసుకోక ముందే అమీన్ పూర్ లో 23 ఎకరాల స్థలంలో సాహితీ శ్రావణీ ఎలైట్ పేరుతో 38 అంతస్తుల్లో హైరైజ్ అపార్ట్ మెంట్లు కడుతున్నానని.. ప్రీ లాంచ్ ఆఫర్ కింద చదరపు అడుగుకీ రూ.2 వేల నుంచి రూ.3 వేలకే ఇస్తానంటూ ప్రచారం చేసి పలువురిని ఆకర్షించాడు. ఇలా దాదాపు 1700 మంది నుంచి రూ.539 కోట్లు వసూలు చేశాడు. ఇదే తరహాలో నగరంలోని పలు చోట్ల ప్రీలాంచ్ ఆఫర్ల పేరిట మొత్తం 2500 మంది నుంచి రూ.900 కోట్ల వరకు వసూలు చేశాడు.

ఈ క్రమంలో పలువురు ఉద్యోగులు కూడా తమకు తెలియకుండానే ప్రీలాంచ్ స్కామ్‌లో భాగమయ్యారు. తమ వృత్తిలో భాగంగా పలువురు కస్టమర్లను ఆకర్షించి వారి చేత ప్రీలాంచ్ లో ప్లాట్లు కొనుగోలు చేయించారు. తద్వారా కమీషన్ల రూపంలో వారు దాదాపు రూ.70 కోట్లు సంపాదించార‌ని స‌మాచారం. అయితే, సాహితీ సంస్థ ఎలాంటి ప్లాట్లూ నిర్మించ‌క‌పోవ‌డంతో బాధితులంతా సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఈ కేసులో ఏ1గా సాహితీ ఇన్ ఫ్రా టెక్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణతోపాటు సంస్థ డైరెక్టర్లు, కొందరు ఉద్యోగుల‌నూ నిందితులుగా చేర్చారు. ఏ1 నుంచి ఏ9 వరకు సంస్థకు చెందినవారు ఉండగా.. ఏ 10 నుంచి ఏ 21 వరకు కస్టమర్ల చేత ప్లాట్లు కొనుగోలు చేయించిన ఉద్యోగులే నిందితులుగా ఉన్నారు. అంటే.. ప్రీలాంచ్ మోసాల్లో తెలియకుండా భాగమైనా సరే.. తిప్పలు తప్పవన్నమాట. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తాము విక్రయిస్తున్న ప్లాట్లు, ఫ్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండటమే కాకుండా.. ఇలాంటి ప్రీలాంచ్ మాయాజాలాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles