ఇళ్ల కొనుగోలుదారుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఫిర్యాదు పరిష్కార సెల్స్ ఏర్పాటు చేయాలని రియల్టీ డెవలపర్లకు రెరా సూచించింది. అందులో కనీసం ఫిర్యాదు పరిష్కార అధికారి ఒకరైనా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు మహారాష్ట్ర రెరా ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఇళ్ల కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోలు సమయంలో సదరు ప్రాజెక్టు సేల్స్, మార్కెటింగ్ టీమ్ తో సంప్రదింపులు జరుపుతారు. అయితే, అనంతరం ఈ విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే వాటిని ఎవరు ఎలా పరిష్కరిస్తారు అనేది తెలియదు. ఈ నేపథ్యంలో డెవలపర్లు.. తమ ప్రాజెక్టులకు సంబంధించి ప్రత్యేకంగా ఫిర్యాదు పరిష్కార సెల్ ఏర్పాటు చేస్తే కొనుగోలుదారులకు ప్రయోజకరంగా ఉంటుందని రెరా అభిప్రాయపడింది. కొనుగోలుదారులు తమ ఫిర్యాదులకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, పరిష్కారం పొందే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల రియల్టర్లు ఈ సెల్స్ ఏర్పాటు చేయాలని.. సదరు అధికారి పేరు, వివరాలు, చిరునామాను ప్రాజెక్టు సైట్ వద్ద ఏర్పాటు చేయడంతోపాటు రియల్టర్ల వెబ్ సైట్ లోనూ పొందుపరచాలని స్పష్టం చేసింది.
This website uses cookies.