Categories: LATEST UPDATES

స్టాంపు డ్యూటీ రాయితీ గడువు పొడిగింపు

రియల్ ఎస్టేట్ రంగానికి మద్దతుగా నిలిచేందుకు బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టాంపు డ్యూటీలో ఇస్తున్న రాయితీని ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.కరోనా సమయంలో ఒడుదొడుకులకు గురైన రియల్ రంగానికి ఊతమిచ్చేందుకు 2021లో స్టాంపు డ్యూటీలో 2 శాతం, సర్కిల్ రేటులో 10 శాతం రాయితీ ఇస్తూ బెంగాల్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి దీనిని పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి ఈ గడువు పొడిగించింది. 2023-24 రాష్ట్ర బడ్జెట్ లో ఈ మేరకు ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ రాయితీ గడువు మార్చి 31తో ముగియనుండగా.. దానిని మరో ఆరునెలలపాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చందిర్మ భట్టాచార్య పేర్కొన్నారు.

This website uses cookies.