అదిరిపోతున్న అల్యూమినియం క్లాడింగ్

గ్లోబల్ అల్యూమినియం క్లాడింగ్ ప్యానెళ్ల పరిశ్రమ దుమ్ము రేపుతోంది. 2021లో 6,355.9 మిలియన్ డాలర్లను ఆర్జించిన ఈ పరిశ్రమ.. 2031 నాటికి 10,352 మిలియన్ డాలర్లకు చేరుతుందని అలైడ్ మార్కెట్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. మారుతున్న మార్కెట్ ట్రెండ్లు, టాప్ సెగ్మెంట్లు, కీలక పెట్టుబడి అంశాలు వంటివాటిపై ఈ నివేదికలో సమగ్రంగా విశ్లేషించారు. పట్టణీకరణ పెరుగుదల కారణంగా ప్రపంచ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు డిమాండ్ పెరుగుతోంది. యూఏఈ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, బ్రెజిల్, భారత్, డెన్మార్క్, స్వీడన్, జోర్డాన్, ఖతార్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో 85 శాతం కంటే ఎక్కువ పట్టణీకరణ నమోదైంది. ఇది ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో అధిక జనాభాకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చాలా నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అభివృద్ధి చేయడం చాలా అవసరం. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ నిర్మాణాల్లో అల్యూమినియం క్లాడింగ్ ప్యానెళ్ల వినియోగాన్ని భారీగా పెంచాయి. సమర్థవంతమైనవి, మన్నికైనవే కాకుండా ఖర్చు కూడా తక్కువ కావడంతో చాలా మంది వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో రాబోయే కాలంలో ఈ పరిశ్రమ మరింత వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

This website uses cookies.