Categories: LATEST UPDATES

ఈసీ ఎందుకు?

ఇల్లు కొనేముందు తప్పనిసరిగా చూసుకోవాల్సిన పత్రాల్లో ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ ఒకటి. దీనిని ఈసీ అని పిలుస్తారు. ఆస్తి యొక్క చట్టపరమైన స్వాధీనాన్ని నిర్ధారించే కీలకమైన డాక్యుమెంట్ ఇది. సదరు ఆస్తి ఎలాంటి వివాదాల్లో లేదని ఈ పత్రం ద్వారానే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకం లావాదేవీలో ఈసీ చాలా కీలకమైన పత్రం. సదరు ఆస్తిపై జరిగిన లావాదేవీలకు సంబంధంచిన వివరాలన్నీ ఈసీలో ఉంటాయి. ఆస్తిపై తనఖా లేదా రుణం ఉంటే ఇది తెలియజేస్తుంది. ఇల్లు కొనడం అనేది ఓ ముఖ్యమైన ఆర్థిక పెట్టుబడి. అందువల్ల క్లయింట్లు తప్పనిసరిగా ఈసీని పరిశీలించాలి. ఈసీ తీసుకోవడం వల్ల సదరు ఆస్తికి తాత్కాలిక హక్కులు, బకాయి ఉన్న అప్పులు, లీజులు వంటి ఎలాంటి ఆర్థిక లేదా ఆర్థికేతర బాధ్యతలు ఉండవని కొనుగోలుదారులకు హామీ ఇస్తుంది

This website uses cookies.