Categories: LATEST UPDATES

స్క్వేర్ యార్డ్స్ రియాల్టీ మెటావర్స్ ఆవిష్కరణ

భారత అతిపెద్ద ప్రాప్ టెక్ ప్లాట్ ఫాం ‘స్క్వేర్ యార్డ్స్’ తన రియల్ ఎస్టేట్ మెటావర్స్ ని ఆవిష్కరించింది. రియల్ ఎస్టేట్ సాంకేతికతలో ఇది సరికొత్త అంశం. ఇది యూజర్లకు రియల్ మార్కెట్ నే కాకుండా నగరం మొత్తాన్ని త్రీడీ విధానంలో కళ్లముందుంచుతుంది. అవతార్ తరహాలో యూజర్లు అక్కడ నేరుగా నడుస్తూ అన్నింటినీ పరిశీలించొచ్చు. ఈనెల 20న ముంబైలో జరిగిన కార్యక్రమంలో మెటావర్స్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెటావర్స్ డెమోలు చూపించారు. ఏఆర్, ఏఐ, వీఆర్, త్రీడీ వంటి హైఎండ్ టెక్నాలజీనిను వినియోగించి దీనిని రూపొందించారు. దుబాయ్ మొత్తాన్ని ఈ విధానంలో మ్యాపింగ్ చేశారు. దీంతో దుబాయ్ లో 2వేలకు పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను త్రీడీ విధానంలో చూసే అవకాశం ఉంది. దుబాయ్ తర్వాత మనదేశంలో ముంబై, బెంగళూరు, ఢిల్లీలను ఈ విధానంలో రూపొందించనున్నారు. ‘మెటావర్స్ ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. మా డిజిటల్ ట్విన్ సాంకేతికతలు ఇళ్ల కొనుగోలుదారుల రియల్ ఎస్టేట్ అవసరాల కోసం వ్యవహరించే, లావాదేవీలు చేసే విధానాలను మారుస్తాయని విశ్వసిస్తున్నాం. మా పేటెంటెడ్ డిజిటల్ ట్విన్ టెక్ తో తక్కువ సమయంలోనే దుబాయ్, కెనా, నియోమ్ వంటి ప్రపంచ మార్కెట్ లో ప్రవేశించాం’ అని స్క్వేర్ యార్డ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ తనుజ్ శోరి తెలిపారు.

This website uses cookies.