పటాన్‌చెరులో అందుబాటు ధరలో ఫ్లాట్లను కడుతున్నా.. ప్రజలు కొనేందుకు ముందుకు రావట్లేదు తెలుసా? కొనుగోలుదారుల ఆలోచనా విధానం మారిపోవడమే ఇందుకు ప్రధాన కారణమా?
నిన్నటివరకూ హైదరాబాద్‌లో అందుబాటు ధరలో ఇళ్లు ఎక్కువగా లభించేవి. ఇప్పుడేమో బిల్డర్లు ఎక్కువగా లగ్జరీ వైపు దృష్టి సారించడం మొదలెట్టారు. సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం అవసరాల్ని పరిగణనలోకి తీసుకోకుండా అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు. అందుకే, వాటిలో కొనేందుకు అధిక శాతం మంది ముందుకు రావట్లేదని చెప్పొచ్చు.
కొవిడ్ మహమ్మారి తర్వాత ప్రజల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. సొంతిల్లు లేనివారు ఇల్లు కొనడంపై దృష్టి పెట్టారు. తమకు ఎక్కడో ఒక చోట సొంతిల్లుంటే చాలని భావిస్తున్నారు. మరికొందరు టూ బెడ్రూమ్ ఫ్లాట్ కొనే అర్హత ఉన్నప్పటికీ. 2.5 లేదా 3 బెడ్రూమ్ ఫ్లాట్ల వైపు దృష్టి సారిస్తున్నారు. భవిష్యత్తులో మరోసారి కొవిడ్ వంటి మహమ్మారి దాడి చేస్తే.. ఇంటి నుంచి పని చేసుకోవచ్చనే ఆలోచనతో.. కొంతమంది ఒక బెడ్‌రూం ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు.