Categories: LEGAL

వరిష్ట ఇన్ ఫ్రాకన్ పై మోసం కేసు

ప్లాట్లు ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిందనే ఆరోపణలపై హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ వరిష్ట ఇన్ ఫ్రాకన్ ప్రైవేట్ లిమిటెడ్ పై కేసు నమోదైంది. పలువురు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేసి ప్లాట్లు ఇవ్వనందుకు ఆ కంపెనీ ఎండీ వి. రాధాకృష్ణ, ఎగ్జిక్యూటివ్స్ వి. రాజేశ్వరి, టి. రత్నాకర్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. ప్లాటు కోసం తాను వరిష్ట ఇన్ ఫ్రాకన్ కు రూ.11.36 లక్షలు చెల్లించానని.. కానీ తనకు ప్లాటు ఇవ్వలేదని జి.మహేష్ అనే వ్యక్తి తొలుత ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాపు చేయగా.. మరో 20 మంది కూడా ఇలాగే మోసపోయినట్టు గుర్తించారు. మొత్తమ్మీద రూ.2 కోట్ల మేర ఇలా వసూలు చేసినట్టు నిర్ధారించారు. వీరిలో చాలామందికి కేశంపేటలోని సాఫ్ర‌న్ వ్యాలీ లేఔట్ లో ప్లాట్లు ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశారు. మూడు నుంచి ఆరు నెలల్లో అన్ని అనుమతులూ తీసుకుని ప్లాట్లు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. అయితే, డబ్బులు తీసుకున్న అనంతరం కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ పరారయ్యారు. ఆఫీసు కూడా మూసివేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

This website uses cookies.