poulomi avante poulomi avante

సీఎం సూప‌ర్ విజ‌న్‌ హైద‌రాబాద్ 4.0..

Another New City in Hyderabad

  • ముచ్చ‌ర్ల‌లో 15000 ఎక‌రాల్లో

    నాలుగో కొత్త సిటీ నిర్మాణం

  • అంత‌ర్జాతీయ స్థాయిలో క‌ట్ట‌డాలు

  • సీఎం విజ‌న్ సూప‌ర్ : బిల్డ‌ర్లు

  • బిల్డ‌ర్ల‌కు స‌రికొత్త భ‌రోసానిచ్చిన సీఎం

  • బిల్డ‌ర్లకు, పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ప్ర‌తిరోజు

    సా. 4 నుంచి 6 దాకా అపాయింట్‌మెంట్‌

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌, 9030034591)

హైద‌రాబాద్‌ను అంత‌ర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే స‌రికొత్త అధ్యాయం ఆరంభ‌మైంది. 2050 నాటికి హైద‌రాబాద్‌ను.. ప్ర‌పంచంలోని ఐదు అత్యుత్త‌మ న‌గ‌రాల స‌ర‌స‌న నిల‌బెట్టే ప్ర‌య‌త్నం మొద‌లైంది. ఇందుకోసం వివ‌ర‌ణాత్మ‌క స‌మీకృత మాస్ట‌ర్ ప్లాన్‌ను ప్ర‌భుత్వం సిద్ధం చేస్తోంది. సుమారు ఏడాదిలోపు పూర్త‌య్యే ఈ బృహ‌త్ ప్ర‌ణాళిక ద్వారా.. న‌గ‌రాభివృద్ధికి సంబంధించి రోడ్‌మ్యాప్ ప్ర‌తిఒక్క‌రికీ అర్థ‌మ‌వుతుంది. లండ‌న్‌, న్యూయార్క్ త‌ర‌హాలో హైద‌రాబాద్‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉండ‌టం గ‌మ‌నార్హం. మొత్తానికి, ముచ్చ‌ర్ల‌లో ప‌దిహేను వేల ఎక‌రాల్లో నెట్ జీరో సిటీని డెవ‌ల‌ప్ చేస్తున్నారు.

హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే ఉన్న ఐటీ, బ్యాంకింగ్‌, ఫైనాన్షియ‌ల్‌, బీమా, లైఫ్ సైన్సెస్‌, ఫార్మా ఎకో సిస్ట‌మ్స్‌కు త‌మ మ‌ద్ధ‌తు కొన‌సాగుతుంద‌ని అన్నారు. తెలంగాణ‌ను ప‌లు రంగాల్లో జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు. విత్త‌నాల ప్రాసెసింగ్‌, హార్డ్‌వేర్‌, ఎల‌క్ట్రానిక్స్‌, సెమీ కండ‌క్ట‌ర్స్‌, బ‌యోటెక్‌, డిఫెన్స్‌, ఏరో స్పేస్ వంటి సెక్టార్ల‌ను జాతీయ కేంద్రంగా డెవ‌ల‌ప్ చేస్తామ‌ని తెలిపారు. కొత్త‌గా సేంద్రీయ వ్య‌వ‌సాయం, అగ్రి ప్రాసెసింగ్‌, గ్లోబ‌ల్ క్యాప‌బిలిటీ సెంట‌ర్లు, ఆర్టిఫిషీయ‌ల్ ఇంటెలిజెన్స్‌, ఐవోటీ, డేటా సెంట‌ర్ వంటి విభాగాల్లో ప్ర‌పంచంలోనే టాప్ డెస్టినేష‌న్‌గా తీర్చిదిద్దుతామ‌ని వివ‌రించారు. ఇందుకోసం ఐదు రంగాల్ని గేమ్ ఛేంజ‌ర్లుగా అభివ‌ర్ణించింది.

మూసీ రివ‌ర్ ఫ్రంట్‌..

లండ‌న్‌, న్యూయార్క్, దుబాయ్ త‌ర‌హాలో యాభై ఐదు కిలోమీటర్ల మేర‌కు ప్ర‌భుత్వం మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ చేప‌డుతుంది. న‌గ‌రాన్ని మూసీతో అనుసంధానం చేస్తూ.. సుమారు ఇర‌వై ఐదు వేల ఎక‌రాల్లో స్థ‌లాభివృద్ధిని చేస్తుంది. దీని వ‌ల్ల హైద‌రాబాద్‌కు క‌లిగే ప్ర‌యోజ‌నం ఏమిటంటే.. 1.2 బిలియ‌న్ చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో మౌలిక స‌దుపాయాలు అభివృద్ధి చెందుతాయి. ఇందులో ఆఫీస్‌, రెసిడెన్స్‌, రిక్రియేష‌న్‌, గ్రీన్ స్పేసెస్‌, బ్రిడ్జీలు, ఐకానిక్ స్ట్ర‌క్చ‌ర్లను డెవ‌ల‌ప్ చేస్తారు. క‌ల్చ‌ర్‌, కామ‌ర్స్‌, లివింగ్ వంటివి ఒకే ప్రాంతంలో దొరికేలా నియోహ‌బ్‌ల‌ను అభివృద్ధి చేస్తారు.

ఫ్యూచ‌ర్ సిటీని ఇలా..

ప్ర‌పంచంలోనే అతిపెద్ద అర్బ‌న్ పార్కును హైద‌రాబాద్‌లో అత్యంత‌ సుంద‌రంగా అభివృద్ధి చేస్తారు. దీనికి రాజీవ్ పార్క్ అని నామ‌క‌ర‌ణం చేస్తారు. దేశ‌, విదేశీ ప‌ర్యాట‌కుల్ని ఆక‌ర్షించ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యమ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఇందులో నైట్ స‌ఫారీ, బ‌ర్డ్స్ పార్క్‌, స్నేక్ పార్క్‌, అండ‌ర్ వాట‌ర్ వ‌ర‌ల్డ్ వంటివి ఆరంభిస్తారు. ఫ్ల‌వ‌ర్ గార్డెన్స్‌, ఓపెన్ ఏయిర్ యాంఫీ థియేట‌ర్‌, మినీ లేక్స్‌, ఫౌంటెయిన్స్‌, వాట‌ర్ బాడీస్ వంటి వాటికి స్థానం క‌ల్పిస్తారు. వాకింగ్‌, జాగింగ్‌, స‌మావేశాలు వంటి వాటికి చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

రాజీవ్ పార్క్ సెంట‌ర్‌లో మినార్ 5ని ప్లాన్ చేశారు. ఇందులోనే 125 అంత‌స్తుల అబ్జ‌ర్వేట‌రీ డెక్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది ప్ర‌పంచంలోనే అతి ఎత్త‌యిన‌ది కావ‌డం గ‌మ‌నార్హం. ఇది భార‌త‌దేశంలోనే ఆధునిక సూప‌ర్ స్ట్ర‌క్చ‌ర్ అని చెప్పొచ్చు. ఇందులో స్కై డిన్న‌ర్లు, సి- సూట్‌, ఎగ్జిక్యూటివ్ స్పేసెస్ వంటివి ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం ఇంటిగ్రేటెడ్ సిటీని డ్రోన్ పెట్రోలింగ్‌, పోలీస్ కంట్రోల్ వార్ రూమ్ వంటి వాటితో సెక్యూరిటీకి పెద్ద‌పీట వేస్తారు. ఈ పార్కుకు నాలుగు వైపులా వంద ఎక‌రాల్లో అల్ట్రా ల‌గ్జ‌రీ రెసిడెన్షియ‌ల్ ప్రాజెక్టుల్ని నిర్మిస్తారు. ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన అపార్టుమెంట్ల‌ను క‌ట్ట‌డానికి ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నారు. ఒక్కో అపార్టుమెంట్ విస్తీర్ణం సుమారు వంద అంత‌స్తుల ఎత్తులో ఉంటుంది. అదేవిధంగా, ఊబ‌ర్ ల‌గ్జ‌రీ విల్లా ప్రాజెక్టుల్ని డిజైన్ చేస్తారు.

 

రీజిన‌ల్ రింగ్ రోడ్డు- రైల్ నెట్‌వ‌ర్క్‌..

రీజిన‌ల్ రింగ్ రోడ్డు చుట్టూ రైల్వే నెట్‌వ‌ర్క్ స‌దుపాయాన్ని డెవ‌ల‌ప్ చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తోంది. డీపీఆర్‌ను సిద్ధం చేయ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుండ‌గా.. మొత్తం పూర్త‌వ్వ‌డానికి దాదాపు ప‌దిహేనేళ్లు ప‌డుతుంది. ప్ర‌ధాన ప్రాంతాల్లో 25 స్టేష‌న్ల‌ను అభివృద్ధి చేస్తారు. భ‌విష్య‌త్తులో న‌గ‌రాల మ‌ధ్య ఏర్ప‌డే ట్రాఫిక్ ర‌ద్దీని త‌గ్గించేందుకు ఈ ప్ర‌ణాళిక చ‌క్క‌గా స‌రిపోతుంది. పైగా, మ‌నుష్యులు, వ‌స్తువుల ర‌వాణా చౌక‌గా, వేగంగా జ‌రుగుతుంది.

గ్లోబ‌ల్ హెల్త్ హ‌బ్‌..

ప్ర‌పంచంలోనే అతిపెద్ద హెల్త్ కేర్ ఎకో సిస్ట‌మ్‌ను హైద‌రాబాద్లో రేవంత్ స‌ర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇందులో సుమారు ఇర‌వై వేల ప‌డ‌క‌ల‌కు స్థానం క‌ల్పిస్తారు. ఒక్కో బ్లాకులో సుమారు ఐదు వేల బెడ్ల‌ను ఏర్పాటు చేస్తారు. మెడిక‌ల్ మ‌రియు రిసెర్చ్ రంగాల్లో అంత‌ర్జాతీయ కేంద్రాలకు స్థానం క‌ల్పిస్తారు. రెండు బ్లాకుల్లో కార్పొరేట్ మెడిక‌ల్ సెంట‌ర్లను పొందుప‌రుస్తారు. కేవ‌లం ఆరోగ్య‌శ్రీ రోగుల కోసం ప్ర‌త్యేకంగా ఒక బ్లాకును ఏర్పాటు చేస్తారు.

ఏఐ సిటీ

దేశంలోనే ప్ర‌ప్ర‌థ‌మంగా ఏఐ సిటీని డెవ‌ల‌ప్ చేసేందుకు ప్ర‌ణాళ‌క‌ల్ని ర‌చించిన ఘ‌న‌త కాంగ్రెస్ స‌ర్కార్‌కే ద‌క్కుతుంది. రోబోటిక్స్‌, ఐవోటీ సిటీ వంటివాటిని డెవ‌ల‌ప్ చేస్తారు. భ‌విష్య‌త్తు త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా బ్లూ గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ను పొందుప‌రుస్తారు. మొత్తానికి టెక్నాల‌జీ ఆధారిత ప‌ట్ట‌ణాభివృద్ధిని ఇందులో చేసి చూపెడ‌తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

ఉతోపియ‌న్ క‌మ్యూనిటీ లివింగ్‌

హైద‌రాబాద్ కొత్త సిటీలో ఉతోపియ‌న్ క‌మ్యూనిటీని లివింగ్ ను చేసి చూపెట్ట‌డానికి ప్ర‌భుత్వం స‌మాయ‌త్తం అవుతోంది. ఇందులో భారీ స్థాయిలో స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ను అభివృద్ధి చేస్తారు.

హైడ్రా..

ప్రపంచంలోనే ప్ర‌ప్ర‌థ‌మంగా డిజాస్ట‌ర్ రెస్సాన్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన ఘ‌న‌త కాంగ్రెస్ స‌ర్కార్‌కే ద‌క్కుతుంది. ఏరియ‌ల్ పెట్రోలింగ్‌తో సిటీని మొత్తం ప‌హారా కాస్తారు. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. సుమారు ప‌ది వేల మందితో ట్రాన్స్ జెండ‌ర్ల‌ను ట్రాఫిక్ వాలంటీర్ ఫోర్స్‌గా వినియోగించాల‌ని ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తోంది.

హైద‌రాబాద్ 4.0 స్పెషాలిటీస్

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన హైద‌రాబాద్ 4.0 సిటీలో.. ఈ కింద పేర్కొన్న వాటివి అభివృద్ధి చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తోంది.

  • స్కిల్ యూనివ‌ర్శిటీ- 100 ఎక‌రాలు
  •  ఏఐ సిటీ- 200 ఎక‌రాలు
  • 4000 ఎక‌రాల్లో ఫార్మా రిసెర్చ్ సిటీ (ఐడీపీఎల్, జీనోమ్ వ్యాలీ త‌ర‌హాలో)
  •  1000 ఎక‌రాల్లో స్పోర్ట్స్ సిటీ
  • అగ్రిక‌ల్చ‌ర్ ప్రాసెసింగ్ సిటీకాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత.. బిల్డ‌ర్ల‌తో ఏర్పాటైన ప్రప్ర‌థ‌మ స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధ‌ర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంఏయూడీ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ దాన‌కిశోర్‌, హెచ్ఎండీఏ క‌మిష‌నర్ స‌ర్ఫ‌రాజ్ ఆహ్మ‌ద్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌నర్ ఆమ్ర‌పాలి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ ప్లానింగ్ మెంబ‌ర్ ఎస్‌. దేవెంద‌ర్ రెడ్డి, కుష్‌మ‌న్ వేక్‌ఫీల్డ్ బృంద స‌భ్యులు, ప‌లువురు బిల్డ‌ర్లు పాల్గొన్నారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles