హైదరాబాద్‌లో ఫ్యూచరిస్టిక్ లొకేషన్ అంటే కోకాపేట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న తీరును చూసి.. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడే తమ కార్యాలయాల్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఏర్పడే ఉద్యోగ, ఉపాధి అవకాశాల వల్ల కోకాపేట్లో అనేక నిర్మాణ సంస్థలు ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల ఒక సంస్థ నియోపోలిస్ సమీపంలో ఆరంభించిన కొత్త ప్రాజెక్టులో చదరపు అడుక్కీ రూ.10 వేల చొప్పున హాట్‌కేకులా ఫ్లాట్లను విక్రయించిందని తెలిసింది. ఓ నాలుగైదేళ్ల తర్వాత కోకాపేట్ ప్రాంతమంతా ఓ విదేశీ నగరాన్ని తలదన్నే రీతిలో.. వరుస ఆకాశహర్మ్యాలతో అలరారుతుందని ఇట్టే అర్థమవుతోంది. ఈ ప్రాంతం గ్రోత్ అవ్వడానికి ఆస్కారమున్న అంశాన్ని గుర్తించిన అనేక మంది హోమ్ బయ్యర్లు కోకాపేట్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాగూ మంచి అప్రిసియేషన్ అందుకునే అవకాశం ఉండటంతో ఇప్పుడే ఫ్లాట్లను కొనుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారందరికీ ఉన్న రెండు చక్కటి ఆప్షన్లు.. పౌలోమీ అవాంతే మరియు పౌలామీ పలాజో.
కోకాపేట్‌లో ఎప్పుడో నాలుగైదేళ్లయ్యాక పూర్తయ్యే ప్రాజెక్టుల్లో నివసించడం కంటే.. అలా ఫ్లాటు కొనగానే ఇలా ఇంటీరియర్స్ చేసుకుని.. గృహప్రవేశం చేయాలని భావించేవారికి అందుబాటులో ఉన్న ఒక చక్కటి ఆప్షన్.. పౌలోమీ అవాంతే. మరో మూడు నెలల్లో ఈ ప్రాజెక్టును హ్యాండోవర్ చేయడానికి సంస్థ ప్లాన్ చేస్తోంది. సుమారు 4.75 ఎకరాల్లో ఇందులో వచ్చేవి మూడు బ్లాకులే. అందులోనూ ఇరవై రెండు అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న అవాంతేలో వచ్చే ఫ్లాట్ల సంఖ్య నాలుగు వందల డెబ్బయ్ ఐదు మాత్రమే. ఇందులో ప్రస్తుతం కేవలం కొన్ని ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, ఫ్యూచరిస్టిక్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ కావాలంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పౌలోమీ అవాంతేలో మీకు నచ్చిన ఫ్లాటును బుక్ చేసుకోండి. ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేసిన ఈ ప్రాజెక్టు మీకు లగ్జరీ లైఫ్ స్టయిల్‌ను అందజేస్తుంది.
This website uses cookies.