Categories: LATEST UPDATES

సంక్షోభంలో జర్మనీ హౌసింగ్ విభాగం

ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో రియల్ రంగం కుదేలవుతోంది. మొన్న చైనాలో రియల్ రంగం దివాళా తీయగా.. ఇప్పుడు జర్మనీ ఆ బాటలో పయనిస్తోంది. దీంతో పలువురు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వలేరియ్ షివ్ చెంకో ఎంతో కష్టపడి టూ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ కొనుక్కుని తన కలను సాకారం చేసుకుందామనుకున్నారు. ఆ మేరకు డబ్బు చెల్లించి ఓ ఫ్లాట్ తీసుకున్నారు. అయితే, రెండేళ్లు తిరగకుండానే ఆయన కల కలగానే మిగిలిపోయింది. ప్రాజెక్ట్ ఇమ్మొబిలీన్ సంస్థ దివాళా తీసింది. షివ్ చెంకో పెట్టుబడి పెట్టింది ఈ ప్రాజెక్టులోనే కావడంతో ఏం చేయాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈయన ఒక్కరే కాదు.. ఎందరో ఉన్నారు. వడ్డీ రేట్లలో పెరుగుదల, నిర్మాణ సామగ్రి రేట్లు రెట్టింపు కావడం వంటి పరిణామాలతో గత 12 నెలల కాలంలోనే పలువురు డెవలపర్లు ఐపీ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో జర్మనీ వ్యాప్తంగా పలువురు కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు. ఆగస్టు నుంచి నిర్మాణాలు నిలిచిపోయాయని, వర్కర్ల కేబినెట్లు, క్రేన్ వంటి ప్రతి సామాగ్రినీ ఇక్కడ నుంచి తరలించేశారని షివ్ చెంకో వాపోయారు.

* దేశవ్యాప్తంగా పలు చోట్ల ఇవే సీన్లు కనిపిస్తుండటంతో చాన్స్ లర్ ఒలాఫ్ స్కోల్జ్.. ప్రాపర్టీ రంగంలోని ప్రముఖ డెవలపర్లతో చర్చలు జరిపారు. వెంటనే నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేనంత తక్కువకు వడ్డీ రేట్లు ఉండటంతో ఇళ్లకు డిమాండ్ పెరిగి కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేశారు. అయితే, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జర్మనీపై పిడుగులా పడింది. ఈ యుద్ధం ఫలితంగా సామగ్రి ధరలు పెరగడం.. ద్రవ్యల్బణాన్ని అరికట్టడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడంతో రియల్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలో ప్రముఖ డెవలపర్ వోనోవియా తాజాగా 60వేల ప్రాజెక్టులను నిలిపివేసింది. ప్రతి ఐదు కంపెనీల్లో ఓ కంపెనీ తమ ప్రాజెక్టులను రద్దు చేసుకున్నాయి.

This website uses cookies.