చైనాలోని వివిధ నగరాల్లో దయ్యాల నగరాల్ని కట్టింది. అవును.. దాదాపు ఐదు కోట్ల గృహాల్నికట్టిందని సమాచారం. గత ఎనిమిదేళ్లుగా వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు? దీంతో, ఏం చేయాలో అర్థం కాకపోవడంతో అక్కడి అధికారులు.. రెండు వారాల క్రితం ఏం చేశారో తెలుసా? కున్‌మింగ్ సిటీలో దాదాపు 85 వేల బాంబులతో పదిహేను హైరైజ్ అపార్టుమెంట్లను కుప్పకూల్చేశారు. ఔను.. వాటిని పూర్తిగా నేలమట్టం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటి కూల్చివేతలు ఆయా దేశంలో సర్వసాధారణం కానుంది. స్ట్రక్చర్ పూర్తయ్యి.. మొండి గోడలుగా కనిపించే అపార్టుమెంట్లన్నీ నేలమట్టం చేస్తారని సమాచారం. మరి, జీవితకాలంలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో వాటిలో ఇళ్లను కొన్నవారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించారా?
ప్రస్తుతం చైనాలో ఎలా చూసినా.. సుమారు 9 కోట్ల గృహాలు అమ్మకాల్లేక ఖాళీగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. వేల ఎకరాల్లో కట్టిన ఈ అపార్టుమెంట్లను తీసుకోవడానికి కొనుగోలుదారులు అస్సలు ముందుకు రావడం లేదు. చైనాలో ఖాళీగా ఉన్న గృహాల్లో 5-జి దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, యునైటెడ్ కింగ్ డమ్ దేశాల ప్రజలందరూ కలిసి నివసించొచ్చు. యూబీఎస్ తాజా గణాంకాల ప్రకారం.. ఎవర్ గ్రాండ్ వంటివి దాదాపు పది నిర్మాణ సంస్థలు చైనాలో ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాయి.
This website uses cookies.