నగరానికి చెందిన గిరిధారి హోమ్స్ రియల్ రంగంలో తమదైన ముద్రను వేసేందుకు సమాయత్తం అవుతోంది. ఈ సంస్థ ప్రస్తుతం రూ.155 కోట్ల వ్యయంతో హ్యాపీనెస్ హబ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత వారం ఆరంభించిన ఈ ప్రాజెక్టుకు బయ్యర్ల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. దీంతో సంస్థ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.
వచ్చే ఏడాదిలోపు హైదరాబాద్లో సుమారు రూ.1500 కోట్ల విలువ గల ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తున్నామని గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. దాదాపు మూడు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నామని రియల్ ఎస్టేట్ గురుకి తెలిపారు.