Categories: Celebrity Homes

రాజ్ కపూర్ బంగ్లా కొన్న గోద్రేజ్

 

ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ కు చెందిన బంగ్లాను గోద్రేజ్ ప్రాపర్టీ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ముంబై చెంబూరులోని దియోనర్ ఫామ్ రోడ్డులో ఉన్న ఈ ప్రాపర్టీని ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయడం కోసం కపూర్ కుటుంబం నుంచి కొనుగోలు చేసింది. 2019 మేలో కపూర్ కుటుంబానికే చెందిన ఆర్కే స్టూడియోస్ ను కొనుగోలు చేసి ప్రీమియం మిక్స్ డ్ యూజ్ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది పూర్తి కానుంది. ప్రీమియం ప్రాజెక్టులకు డిమాండ్ పెరగడంతో తాము వీటిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టు గోద్రేజ్ ప్రాపర్టీ లిమిటెడ్ ఎండీ సీఈఓ గౌరవ్ పాండే పేర్కొన్నారు.

This website uses cookies.