Categories: LATEST UPDATES

రోజుకు రూ.లక్ష గెలిచే చాన్స్

  • పండగ సీజన్ ను వేడుక చేస్తున్న గోద్రేజ్

ఈ పండగ సీజన్ ను మరింత వేడుక చేసేందుకు గోద్రేజ్ అండ్ బాయ్ సీ ఆకర్షణీయమైన ఆఫర్లతో వచ్చింది. సంస్థ 125వ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 1 నుంచి 25 వరకు రోజుకు రూ.లక్ష గెలిచే చాన్స్ తీసుకొచ్చింది. ప్రతిరోజూ 125 మంది విజేతలుగా నిలిచే అవకాశం కల్పించింది. గోద్రేజ్ అండ్ బాయ్ సీకి చెందిన గోద్రేజ్ అప్లయెన్సెస్, గోద్రేజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్, గోద్రేజ్ లాక్స్, గోద్రేజ్ ఇంటెరియోల్లో ఆకర్షణీయమైన రాయితీలు, క్యాష్ బ్యాక్ ప్రోత్సాహాలు అందిస్తోంది. అంతేకాకుండా ఉత్పత్తులు కొనుగోలుచేసినవారు లక్కీ డ్రాలో పాల్గొనడం ద్వారా రోజూ రూ.లక్ష నగదు బహుమతి పొందే అవకాశాన్ని సొంతం చేసుకుంటారు. మొత్తం 125 మంది అదృష్టవంతులు రూ.లక్ష అందుకుంటారు. ఏ రోజు విజేతను అదే రోజు రాత్రి 8 గంటలకు గోద్రేజ్ వెబ్ సైట్ లో ప్రకటిస్తారు.

This website uses cookies.