ఔను.. మీరు చదివింది నిజమే! దేశంలోనే పేరెన్నిక గల నిర్మాణ సంస్థ అయిన గోద్రెజ్ ప్రాపర్టీస్.. హైదరాబాద్లోని కోకాపేట్లో రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. నగర రియాల్టీకి ఇది మంచి విషయమే అయినప్పటికీ.. ఈ సంస్థ ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
టీజీ రెరా అనుమతి తీసుకున్నట్లు ఈ సంస్థ ప్రకటనల్లో ఎక్కడా కనిపించలేదు. స్థానిక సంస్థలు, ప్రెస్టీజ్ వంటి కంపెనీలు ప్రీలాంచ్లో అమ్మినా పట్టించుకోని టీజీ రెరా.. గోద్రెజ్ ప్రాపర్టీస్ మీద చర్యలు తీసుకుంటుందని ఆశించడం అత్యాశే అవుతుంది.