Categories: EXCLUSIVE INTERVIEWS

వాస‌వి అట్లాంటిస్‌కు అధిక ఆద‌ర‌ణ‌..

  • వాస‌వి అట్లాంటిస్ డైరెక్ట‌ర్ ఎం. దివ్య
  • విలాసవంతమైన నివాసాలకే
    మెజార్టీ కొనుగోలుదారుల చూపు

ఒకప్పుడు మన దేశంలో లగ్జరీ ఇళ్లంటే అత్యంత ధనికులకు మాత్రమే అనే పరిస్థితి ఉండేది. వీటి అమ్మకాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారాయి. దేశంలో లగ్జరీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత మూడేళ్లలో చాలా మార్పుల్ని చూసింది. కరోనా ముందు వరకు మంచి ఇల్లుంటే చాలు అనుకునేవారంతా ఇప్పుడు విశాలమైన స్థలం, సకల సౌకర్యాలతో ఉన్న లగ్జరీ నివాసాలకే మొగ్గు చూపుతున్నారు. విశాలంగా ఉండటంతోపాటు మెరుగైన భద్రత, ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని విలాసవంతమైన, విశాలమైన ఇళ్లకే ఓటేస్తున్నారని వాసవి అట్లాంటిస్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం. దివ్య తెలిపారు. నార్సింగిలో వాసవి గ్రూప్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న వాసవి అట్లాంటిస్ మార్కెటింగ్ బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న ఆమె.. నగర నిర్మాణ రంగంలో బయ్యర్ల ఆలోచనల్లో వస్తోన్న మార్పుల గురించి రియల్ ఎస్టేట్ గురికి ప్రత్యేకంగా వివరించారు. సారాంశం ఎం. దివ్య మాటల్లోనే..

క్లబ్ హౌస్, ఫిట్ నెస్ సెంట్లర్, స్విమింగ్ పూల్, ఆటస్థలాలు, క్రీడా సౌకర్యాలు, ఆన్ సైట్ సూపర్ మార్కెట్, ఫార్మసీ, ప్రీమియం సౌకర్యాలతో కూడిన లగ్జరీ గేటెడ్ కమ్యూనిటిల వైపు మొగ్గు చూపుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాల్లో ఫ్లాట్లను ఎంచుకునేందుకు అధిక శాతం మంది ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో మేం నిర్మిస్తున్న వాస‌వి అట్లాంటిస్‌కు బ‌య్య‌ర్ల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. నార్సింగి స‌ర్వీస్ రోడ్డు ప‌క్క‌నే చేప‌ట్టిన‌ ఈ ప్రాజెక్టు విశిష్ఠ‌త‌లు, ఆధునిక స‌దుపాయాల్ని గ‌మ‌నించాక‌.. చాలామంది ఫ్లాట్ల‌ను కొంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మా ఈ ప్రాజెక్టు నుంచి అటు మాదాపూర్ కానీ ఇటు గ‌చ్చిబౌలి కానీ సులువుగా వెళ్లొచ్చు. ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్టు అయితే క్ష‌ణాల్లో వెళ్లిపోవ‌చ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వ‌ల్ల అధిక శాతం మంది విలాస గృహాల‌ను ఎంచుకుంటున్నారు. ఇంట్లోనే ఆఫీసు పని చేసుకోవడానికి వీలుగా తమకు వ్యక్తిగత స్పేస్ ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో 3 మరియు 4 బీహెచ్ కే ఫ్లాట్లు, విశాలమైన నివాసాలకు డిమాండ్ అధికమవుతోంది.

This website uses cookies.