రెజ్ న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) బుధవారం నిర్వహించిన ఆన్ లైన్ వేలానికి మంచి ఆదరణ లభించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ బుధవారం నిర్వహించిన ఆన్ లైన్ వేలంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లా పరిధిలోని 9 ప్లాట్లను ఆన్లైన్ ద్వారా అమ్ముడయ్యాయి. దీని ద్వారా సుమారు రూ.195.24 కోట్ల ఆదాయం లభించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ప్లాట్లను కొనడానికి ఆసక్తి చూపెట్టడంతో గజం రూ.1.11 లక్షల దాకా పలికింది. రెండో దశ అమ్మకాలకు మరో మూడు రోజుల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని హెచ్ఎండీఏ తెలిపింది.
హెచ్ఎండీఏ వేలానికి మంచి ఆదరణ
Hmda Auctioned 38 plots in three districts and sold nine. The highest price is Rs.1.10 Lakhs per yard.
* ప్లాటు గజం రూ.1.10 లక్షలకు పలకింది కాబట్టి, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు అదే రేటు వర్తించదని గుర్తుంచుకోండి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ వేలం నిర్వహించారు కాబట్టి.. సాధారణ ప్లాట్లకు అదే ధర పలకదు. కాబట్టి, కొందరు మధ్యవర్తులు చేసే ప్రచారాన్ని నమ్మి అధిక రేటును పెట్టొద్దు.