Categories: LATEST UPDATES

అద్దెపై జీఎస్టీ బాదుడు

  • రెసిడెన్షియల్ ప్రాపర్టీలను వాణిజ్య అవసరాలకు అద్దెకిస్తే 18 శాతం జీఎస్టీ

అద్దెలపై జీఎస్టీ విధించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్షియల్ ప్రాపర్టీలను వాణిజ్య అవసరాల కోసం ఇస్తే.. దాని ద్వారా వచ్చే అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మేరకు ఇటీవల జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

రెసిడెన్షియల్ ప్రాపర్టీలను నివాస అవసరాల కోసం ఇచ్చనట్టయితే జీఎస్టీ వర్తించదు. కానీ వాణిజ్య అవసరాల కోసం ఇస్తే మాత్రం ఆ అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించక తప్పదు. కంపెనీ ఆ భవనాన్ని నివాస అవసరాల కోసం అద్దెకు తీసుకున్నప్పటకీ, 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. జూలై 18 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అద్దెకు తీసుకున్న ప్లాట్ లో నివసిస్తున్న, రిజిస్టర్డ్ జీఎస్టీ నంబర్ లేని ఏ వ్యక్తి అయినా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, జీఎస్టీ నంబర్ ఉన్న కంపెనీ వ్యక్తులకు లీజుకు ఇస్తే అద్దెదారు జీఎస్టీ చెల్లించాలి. రివర్స్ మెకానిజం కింద ప్రభుత్వ క్రెడిట్ కు లీజుదారు ఈ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

This website uses cookies.