Categories: TOP STORIES

ఘనంగా వరల్డ్ టౌన్ ప్లానర్స్ డే

వరల్డ్ టౌన్ ప్లానర్స్ డే కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లోని టౌన్ ప్లానర్ల సంఘం కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా.. జీహెచ్ఎంసీ ప్రాంతంలో సమస్యలు.. వాటి పరిష్కారాలపై తెలంగాణ ఐటీపీఐ చాప్టర్ స్కెచ్ కాంపిటీషన్ నిర్వహించింది. సుమారు వంద మందికి పైగా బీటెక్ ప్లానింగ్ విద్యార్థులు, ఐటీపీఐ సభ్యులు పాల్గొన్నారు. ప్లానింగ్ విద్యార్థుల్లో మున్నూరు కళ్యాణి, హేమంత్, సాయి శ్రీజ, మల్లికార్జున్.. ఐటీపీఐ సభ్యుల్లో కిరణ్ కుమార్, దేవిశెట్టి అపర్ణ,కాళీ కృష్ణ, కల్పన కంది తదితరులు విజేతలుగా నిలిచారు.

ఈ సందర్భంగా ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి, ఇతర సీనియర్ సభ్యులు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ టౌన్ ప్లానర్ల సంఘం చైర్మన్ కొమ్ము విద్యాధర్ మాట్లాడుతూ.. నగరాలూ, పట్టణాలు భవిష్యత్తులో హరితమయం కావాలన్న.. ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చెందాలన్నా.. టౌన్ ప్లానర్లు కీలక పాత్రా పోషించాల్సి ఉంటుందని అన్నారు. అందుకే పట్టణ సమస్యల పరిష్కారానికి వారిలోని సృజనాత్మకతను బయటికి తెచ్చేందుకు ఈ పోటీలను నిర్వహించామని తెలిపారు.

This website uses cookies.