HMDA acquires land via pooling for city development
ఇటీవల ఔటర్.. ఇన్నర్ ఇలా ఎక్కడైనా గజం భూమి కొనాలంటే ఒక విధమైన భయం నెలకొన్నది. భూమి కాగితాలు అన్నీ సక్రమంగా ఉన్నట్టే ఉన్నా.. ఎక్కడో ఓ చోట తేడా కొడుతుంది. దాంతో హైడ్రా నోటీసులు వస్తున్నాయి. లోన్లు తెచ్చుకున్నాం.. ఎల్‌ఆర్‌ఎస్ తీసుకున్నాం, అన్ని ట్యాక్స్‌లు కడుతున్నాం అంటూ పత్రాలు చూపించినా.. హైడ్రా మాత్రం అది ప్రభుత్వ భూమి అనో, పార్క్ భూమి అంటూ బుల్డోజర్లను దింపుతుంది.
దీంతో ఇప్పుడు నగరం చుట్టూ ఎక్కడైనా భూమి కొనాలంటూ భయంతో వణుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్త ప్లాన్ వేసింది. హెచ్‌ఎండీఏను రంగంలోకి దింపి.. HMDA real estate హెచ్‌ఎండీఏ ద్వారా రియల్ వ్యాపారాన్ని చేపట్టుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆదాయం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ లేఅవుట్లను అభివృద్ధి చేస్తోన్నది.
ల్యాండ్ పూలింగ్ పథకం Land pooling scheme కింద రైతుల నుంచి సమీకరించిన భూమిని హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తుంది. అభివృద్ధి చేసిన భూమిలో 60 శాతం భూమిని రైతులకు తిరిగి బదిలీ చేస్తుంది. మిగిలిన 40 శాతం భూమిని హెచ్ఎండీఏ విక్రయిస్తుంది. గతంలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో దాదాపు 924.28 ఎకరాలను అధికారులు భూ సమీకరణ కోసం పరిశీలించారు.
This website uses cookies.