land market value increased in telangana
రాష్ట్రంలో గడిచిన ఏడేనిమిదేండ్లు రియల్ ఎస్టేట్ వృద్ధితో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. రియల్ బూమ్ కొన్నేళ్ల పాటు స్థిరంగా కొనసాగింది. ప్రస్తుతం ఈ రంగం కొంత ఒడిదుడుకుల మధ్య సాగుతున్నా.. కొంతమేరకు ఇళ్ల కొనుగోళ్లు జరుగుతున్నట్లు రిజిస్ట్రేషన్ లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం భూముల ధరలు తక్కువ విలువలు ఉండటంతో సర్కార్ ఆదాయానికి గండి పడుతోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి, ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను సవరించాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో మార్కెట్ విలువల కేంద్ర మదింపు సలహా కమిటీ దీనిపై చర్చించింది. ప్రైవేట్ ఏజెన్సీ నివేదిక ఆధారంగా, పెంపు శాస్త్రీయంగా ఉండాలని సూచించారు. త్వరలోనే పెంపుపై తుది నిర్ణయం వెలువడనుంది.
ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన వనరుల సమీకరణ సమావేశంలో భూముల విలువ పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు. దీనితో రాష్ట్ర స్థాయిలో మార్కెట్ విలువల కేంద్ర మదింపు సలహా కమిటీ (సీవీఏసీ) సమావేశమై ఈ అంశంపై చర్చించింది. గతంలోనే ఒక ప్రైవేట్ ఏజెన్సీతో భూముల విలువ పెంపుపై అధ్యయనం చేయించిన ప్రభుత్వం, ఆ నివేదిక ఆధారంగా ఆదాయాన్ని పెంచే మార్గాలను పరిశీలించాలని రిజిస్ట్రేషన్ శాఖకు సూచించింది. పలు దఫాలు సమావేశమైన అధికారులు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించారు. రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ విలువ పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. తాజాగా నివేదిక ఇవ్వాలని కోరడంతో పెంపు ఖాయమనే చర్చ జరుగుతోంది.
రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ చైర్మన్‌గా, జాయింట్ ఐజీ కన్వీనర్‌గా వ్యవహరించే సీవీఏసీలో సీసీఎల్‌ఏ కార్యదర్శి, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ భూముల మార్కెట్ విలువలను సమీక్షించి, అవసరమైన సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఇటీవల మంగళవారం రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో సీవీఏసీ సమావేశమై మార్కెట్ విలువలపై చర్చించింది. త్వరలో మరోసారి సమావేశమై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. భూముల విలువలను ఎంత పెంచాలనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని, అయితే ఈ పెంపు శాస్త్రీయంగా ఉండాల
This website uses cookies.