Categories: TOP STORIES

నేటి నుంచి అమ‌ల్లోకి మెట్రో రైలు కొత్త ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలను 20 శాతం పెంచిన తర్వాత ప్రయాణికుల నుండి వ్యతిరేకత రావడంతో, మెట్రో యాజమాన్యం 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ మే 24 నుండి అమల్లోకి వస్తుంది. కనిష్ట ఛార్జీ రూ.11, గరిష్ట ఛార్జీ రూ.69గా నిర్ణయించారు. ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని యాజమాన్యం తెలిపింది. ఈ తగ్గింపు పేపర్, క్యూఆర్ టోకెన్, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులకు వర్తిస్తుందని వెల్లడించారు.

తాజాగా మెట్రో యాజమాన్యం.. డిస్కౌంట్ తర్వాత ఉండే కొత్త ధరల జాబితాను విడుదల చేసింది. దీంతో టికెట్ ధరలు మారాయి. మెట్రోలో కనీస టికెట్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.12లకు, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కు పెరిగాయి. ఇప్పుడు పది శాతం డిస్కౌంట్‌తో కనిష్ట ఛార్జీ రూ.11, గరిష్ట ఛార్జీ రూ.69కి తగ్గింది. తగ్గిన ధరలు మే 24 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. పేపర్, క్యూఆర్ టోకెన్, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులన్నింటిపైన ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని మెట్రో యాజమాన్యం తెలిపింది. 24 కి.మీ ఆపైన రూ.69 వ‌సూలు చేస్తారు. ఉదాహరణకు ఎల్బీనగర్ నుంచి చివరి స్టేషన్ మియాపూర్ వరకు మెట్రో టికెట్ ధర 69 రూపాయలు వ‌సూలు చేస్తారు. కొత్త ఛార్జీలు మే 24, 2025 నుంచి అమల్లోకి వస్తాయని ఈ సందర్భంగా మెట్రో యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.

This website uses cookies.