Shanthasreeram MD M Narsay about real estate business
శాంతాశ్రీరాం ఎండీ ఎం నర్సయ్య
బిజినెస్‌లో ఎప్పుడూ షార్ట్‌కట్స్ అనేవి ఉండవు. ఎప్పుడైతే షార్ట్‌కట్‌లో మనీ వస్తాయో అదే షార్ట్‌కట్‌లో పోతాయి. చాలా మంది కొత్త బిల్డర్లు హైదరాబాద్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. ప్రీ సేల్ చేసి.. కోట్ల రూపాయల్ని సంపాదించారు. తర్వాత వాటిని డైవర్ట్ చేసి.. ఆయా సొమ్మును మిస్ యూజ్ చేసి.. నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో చాలామంది కొనుగోలుదారులు ఇబ్బంది పడ్డారు.
హైదరాబాద్ నిర్మాణ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం గల ఒక బిల్డర్‌గా నేనే చెప్పేదేమిటంటే.. నిర్మాణ రంగంలోకి కొత్తగా వచ్చేవారు కరెక్టుగా ఉండాలి. అక్రమ పద్ధతిలో వెళ్లకూడదు. ఒక కస్టమర్ నుంచి సొమ్ము తీసుకున్నామంటే.. వాళ్ల ప్రతీ రూపాయికి జవాబుదారీతనంతో ఉండాలి. వారి మనీ మన దగ్గర ఉందంటే వాళ్లు చాలా సేఫ్‌గా ఫీల్ అవ్వాలి. అలా చేస్తేనే కొత్త బిల్డర్లు ఈ రంగంలో సక్సెస్ అవుతారు.
This website uses cookies.