- పొప్పాల్‌గూడలో హండ్రెడ్ ఫీట్ రోడ్డుపై వివాదం
పుప్పాల్ గూడ లో ఐఏఎస్, ఐపీఎస్ వర్సెస్ హెచ్ఎండీఏ అధికారుల మధ్య గొడవ జరుగుతోంది. ల్యాంకో హిల్స్ సమీపంలో వంద ఫీట్ల లింక్ రోడ్డును హెచ్ఎండీఏ చేపట్టగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అడ్డుకున్నారని సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే.. 2007 సంవత్సరంలో ప్రభుత్వం సర్వే నెంబర్ 454లో 57 ఎకరాల స్థలాన్ని ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించింది. వీరికి కేటాయించిన స్థలంలో రోడ్డు నిర్మాణ పనుల్ని అధికారులు అడ్డుకుంటున్నారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద ఫీట్ల రోడ్డును అభివృద్ది చేయాల్సిందేనని హెచ్ఎండీఏ అంటుండగా.. ఆ రోడ్డు వేయడానికే వీల్లేదని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అడ్డుకుంటున్నారు. వాస్తవానికి, అక్కడ వంద ఫీట్ల రోడ్డును చూపెట్టిన హెచ్ఎండీఏ పలు హైరైజ్ అపార్టుమెంట్లకు అనుమతినిచ్చింది. తమ రోడ్డులో వంద అడుగుల రోడ్డును ఎలా వేస్తామని హెచ్ఎండీఏను నిలదీస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. వాస్తవానికి అయితే, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏ లేఅవుట్‌లో అయినా వంద అడుగుల రోడ్డు వేయాల్సిందే. మరి, ఇక్కడ అధికారులు ఎందుకు అడ్డు చెబుతున్నారనే విషయం తెలియాల్సి ఉంది.
సంఘటన స్థలానికి నార్సింగి పోలీసులు చేరుకున్నారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారిందని సమాచారం.