Categories: TOP STORIES

వ‌డ్డీ రేటు త‌క్కువ‌.. సొంతింటికి స‌మ‌య‌మిదే!

కొన్నేళ్ల క్రితం గృహరుణాలపై వడ్డీ రేటు పద్నాలుగు శాతం ఉండేది. కానీ, నేడో అది ఏడు శాతమైంది. అంటే, బ్యాంకుకు నెలసరి చెల్లించే వాయిదా ఏకంగా యాభై శాతం తగ్గిపోయింది. మరి, సొంతిల్లు కొనుక్కోవడానికి ఇంతకంటే మంచి తరుణం ఎక్కడ ఉంటుంది చెప్పండి.

కరోనా వల్ల నిర్మాణ రంగం దారుణంగా దెబ్బతిన్నది. లాక్ డౌన్, భవన నిర్మాణ కార్మికుల కొరత, తగ్గిన నిర్మాణ సామగ్రి సరఫరా వంటివి ఈ రంగాన్ని కుంగదీశాయి. ఆతర్వాత పెరిగిన స్టీలు, సిమెంటు ధరలు ఇబ్బంది పెట్టేశాయి. ఫ్లాట్ల గిరాకీ గణనీయంగా తగ్గింది. ఏదో రకంగా ఎక్కడి నుంచో నగదును తీసుకొచ్చి నిర్మాణాల్ని చేపట్టే బిల్డర్లు హైదరాబాద్లో ఉండటం సంతోషించాల్సిన విష‌యం. అయినప్పటికీ, అమ్మకాలు తగినంతగా లేకపోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.

అయితే, ఇక్క‌డ ప్రతిఒక్కరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. నిన్నటివరకు ఇళ్ల రుణాలపై 14 శాతం వడ్డీ కట్టాల్సి వచ్చేది. కానీ, నేడో అది సగానికి తగ్గిపోయింది. అంటే, ఏడు శాతం వడ్డీ రేటుకే రుణాలు లభిస్తున్నాయి. ఒక‌ప్పుడు ప‌ది ల‌క్ష‌ల రుణం తీసుకుంటే, నెల‌కు ప‌ద్నాలుగు వేలు ఈఎంఐ చెల్లించాల్సి వ‌చ్చేది. కానీ, నేడో ఏడు వేలు తీసుకుంటే స‌రిపోతుంది. అంటే, న‌ల‌భై ల‌క్ష‌ల రుణంపై మీరు చెల్లించేది కేవ‌లం రూ.28 వేల‌కు అటుఇటుగా ఉంటుంది. మ‌రి, సొంతిల్లు కొనుక్కోవ‌డానికి ఇంతకు మించిన తరుణం ఎక్క‌డుంటుంది చెప్పండి? ఇలాంటి సానుకూల పరిస్థితి భవిష్యత్తులో ఎదురు కాకపోవచ్చు. కాబట్టి, సొంతింటి ఎంపికలో నేడే స‌రైన నిర్ణ‌యం తీసుకోండి.

This website uses cookies.