Categories: Celebrity Homes

ఇంటి వేట  చాలా ముఖ్యం రియల్ ఎస్టేట్ గురుతో సొన్నల్లి సెగల్

ప్యార్ కా పంచ్ నామా ఫేమ్ సొన్నల్లి సెగల్ కు మినిమలిజం అనే కాన్సెప్ట్ గురించి బాగా తెలుసు. ఆమె గ్లామర్ ప్రపంచానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈ విషయం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. వాస్తవానికి ఆమె తన ఇంట్లో అత్యంత సాధారణమైన వస్తువులను తీసివేసినప్పటికీ.. అంతకుముందు షోబిజ్ లలో కష్టపడి సంపాదించిన కలెక్షన్లతో సొంత ఇల్లు కొన్న రోజులు గుర్తు చేసుకున్నారు. అది ఆమెకు ఎంతో మంత్రముగ్ధులను చేసే క్షణం. ‘ఇది 2010లో వచ్చింది. ఇప్పుడు నాకు రెండు ఇల్లున్నాయి. పాత ఇంటిని ఏ ఇల్లూ ఎప్పటికీ భర్తీ చేయలేదు. ఇక నగర శివార్లలో ఉన్న ఈ ఇల్లు అద్దకు ఉంది. ఆ ఇల్లు నాకు చాలా అదృష్టం తెచ్చిపెట్టింది. నేను ఆ ఇంట్లోకి వెళ్లగానే ఒక సినిమా తర్వాత మరొక సినిమా నా కోసం ఎదురుచూశాయి. ఈ రోజుల్లో ఇంటి వేట అనేది చాలా ముఖ్యమైనది. మనం సరిగా ప్రయత్నిస్తే సరైన ఇంటిని సొంతం చేసుకోగలుగుతాం. ఆ రోజుల్లో పెట్టుబడుల విషయంలో నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానో లేదో కూడా నాకు తెలియదు. అప్పట్లో నా ఆర్థిక వ్యవహారాలన్నీ నేనే చూసుకున్నాను. ఒక సరికొత్త అపార్ట్ మెంట్ కు నా సొంత తాళం వేయడం అనేది అద్భుతంగా అనిపించింది’ అని నటిగా మారిన యాంకర్ సొన్నల్లి వివరించారు.
తన ఇంట్లో సింప్లిసిటీ, మోనోక్రొమాటిక్ ప్యాలెట్ గురించి వివరించారు. ‘నా స్టార్ డమ్ ఆడంబరాలను కోరుకోదు. అందమైన ఇంటీరియర్లు కావాలనుకోదు. నాకు బంగారు రంగంటే చాలా ఇష్టం. నా పేరులో కూడా సోనా ఉంది. మరి అలాంటప్పుడు నేనెందుకు దాని కోసం వెళ్లకూడదు? నేనెప్పుడూ పెద్దగా ఉండే ఇంట్లో నివసించలేను. తెల్లటి షేడ్స్, సూర్యకాంతి ధారాళంగా వచ్చే చక్కని ప్రదేశాలను బాగా ఇష్టపడతాను. ఫంక్షనల్ పర్నిచర్ లేదా ఇంట్లో ఉపయోగించే అందమైన వస్తువులు లేకపోవడమే మంచిది. అవి క్లాసీగా ఉండాలి. అంతకుమించి ఇంకేం కావాలి? ఇక నాకు బంగ్లా ఐడియాలు చాలా ఇష్టం. మీ సొంతింటిని ఎవరి జోక్యం లేకుండా మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. లాన్, స్విమింగ్ పూల్ అందులో తప్పకుండా ఉండాలి. అయితే, వాస్తవానికి ఇలాంటి మెట్రోపాలిటన నగరంలో ఇవి కలిగి ఉండటం కష్టతరం, విలాసవంతం. ముంబైలో స్థలం చాలా ఇరుకు. మేం ఒకరి గోడలను మరొకరు తాకడానికి కొన్ని ఏళ్ల దూరంలో ఉన్నాం’ అని పేర్కొన్నారు.
సొనల్లి తన కలల సౌధం నిర్మించుకోవడానికి రెండు భిన్నమైన ప్రదేశాలు ఉన్న విషయాన్ని వివరించారు. ‘ఒకటి రిషికేష్. అక్కడ నేను ఓ కొండపై ఇల్లు కట్టుకుంటాను. రిషికేష్ లో ఎంత శక్తి ఉందో తెలుసా? మహర్షులు అక్కడ తపస్సు చేస్తుంటారు. కేవలం ఆధ్మాత్మికత కోసం అక్కడకు వెళ్తూనే ఉంటాను. ఇక రెండో నగరం లాస్ ఏంజిల్స్. అబ్బా.. ఎంతటి అందమైన ప్రదేశం అది. ఆ బీచ్ లు అవీ చాలా బాగుంటాయి. పైగా అక్కడ మెగా పరిశ్రమ పనిచేస్తోంది కదా? అలాంటప్పుడు అక్కడ ఏదైనా చేయడానికి నేను ఎందుకు ప్రయత్నించకూడదు? బహుశా హాలీవుడ్ త్వరలో నన్ను పిలుస్తుందేమో చూద్దాం. నేను ఎప్పటికీ సినిమా చేయడం మాత్రం మానేయను. ప్రియాంకా చోప్రాలాగా నా కోసం ఒక ఇంటిని కట్టుకోవడం అక్కడ ఉన్న స్వేచ్ఛ, ఉత్సాహపూరిత వాతావరణం ఎల్లప్పుడూ నన్ను తాకుతుంది. నిజానికి న్యూయార్క్ కంటే నేను ఇప్పటికీ లాస్ ఏంజిల్స్ నే ఎక్కువ ఇష్టపడతాను’ అని సొన్నల్లి తెలిపారు. ఇక ఆమె కలల ఇంట్లో అభిమానులు చూడాల్సిన రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. అవేంటంటే… మెడిటేషన్ గది, జంతువులకు అనుకూలమైన ఫ్లోరింగ్. ‘మెడిటేషన్ గది యోగా స్టూడియోలా ఉండదు. నాకు ఆధ్మాత్మికత ఎక్కువ కాబట్టి దేవతలందరినీ అక్కడ ఉంచుతాను. ఇక మార్బుల్ టైల్స్ అందంగా కనిపించినా.. మన పెంపుడు జంతువులకు ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటి వాటితో అవి ఆర్థరైటిస్ తో బాధపడతాయి’ అని పేర్కొన్నారు.

This website uses cookies.