Categories: TOP STORIES

7.9 శాతం పెరిగిన ఇళ్ల ధ‌ర‌లు

దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగారల్లో ఇళ్ల ధరలు పెరిగాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంకు డేటా ప్రకారం అత్యధికంగా కోల్ కతాలో 11 శాతం మేర ప్రాపర్టీ ధరలు పైకి ఎగబాకాయి. అహ్మదాబాద్ లో 10.8 శాతం మేర పెరగ్గా.. బెంగళూరులో 9.4 శాతం పెరిగాయి. పుణెలో 8.2 శాతం, హైదరాబాద్ లో 7.9 శాతం మేర ఇళ్ల ధరల్లో పెరుగుదల నమోదైంది. చెన్నైలో 6.8 శాతం, ముంబైలో 3.1 శాతం, ఢిల్లీలో 1.7 శాతం చొప్పున పెరిగినట్టు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా టాప్‌-50 పట్టణాల్లో కేవలం ఏడు పట్టణాల్లోనే ఇళ్ల ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా 50 పట్టణాల్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంక్‌ల వద్దనున్న ప్రాపర్టీ వ్యాల్యూషన్లను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. ఈ పట్టణాల్లో ఇళ్ల ధరలు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో సగటున 5.8 శాతం మేర పెరిగిట్టు తేలింది. గతేడాది క్యూ1లో రేట్ల పెరుగుదల 5.3 శాతంగా ఉంది.

This website uses cookies.